ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన పెద్ది మేకర్స్
అయితే ఈ సినిమా టీజర్ కట్ బావున్నప్పటికీ దానికి రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలేదనే మాటలు వినిపిస్తున్నాయి.;

గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి అందరికీ భారీ అంచనాలున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ శ్రీ రామనవమి సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.
ఈ గ్లింప్స్ పై తాజాగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు ఈ గ్లింప్స్ ను చాలా బాగా కట్ చేయించాడని, పెద్ది గ్లింప్స్ రిలీజయ్యాక అందరూ కొంత కాలం పాటూ దాని గురించే మాట్లాడుకుంటారని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కట్ బావున్నప్పటికీ దానికి రెహమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
పెద్ది గ్లింప్స్ కు రెహమాన్ బీజీఎం విషయంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ కోసం రెహమాన్ చాలా ప్రత్యేకంగా క్రేజీ సౌండింగ్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 6న వీడియో గ్లింప్స్ రిలీజయ్యాక అందరికీ ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులంటున్నారు. ఇదిలా ఉంటే పెద్ది కథ తనకు చాలా బాగా నచ్చిందని, ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నానని రెహమాన్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
అంతేకాదు రెహమాన్ కెరీర్ లో ఎప్పుడూ లేనిది సినిమా మొదలుపెట్టకముందే పెద్దికి మూడు ట్యూన్స్ ను కూడా ఇచ్చాడని అప్పట్లోనే వార్తలొచ్చాయి. సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రెహమాన్ అలా ముందుగానే ట్యూన్స్ కంపోజ్ చేయడు అలాంటిది ఇప్పుడు బీజీఎం విషయంలో ఎందుకు లైట్ తీసుకుంటారని చరణ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. బడ్జెట్ విషయంలో బుచ్చిబాబు కు నిర్మాతలు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట.