'పీలింగ్స్' లిరికల్ సాంగ్.. మాస్ బీట్ కు బన్నీ, రష్మిక స్టెప్పులు కేక!
లిరికల్ వీడియోలో అల్లు అర్జున్, రష్మికకు చెందిన దాదాపు డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ చూపించి మరింత బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్ లో లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప-2. ఇద్దరూ కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతుండగా.. డిసెంబర్ 5వ తేదీన బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో మూవీ కోసం అంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే సినిమాపై వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ అవ్వగా.. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అప్పుడే అనేక చోట్ల టికెట్స్ ఫుల్ అయిపోయాయి. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అందరినీ అలరిస్తున్నాయి.
ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన కిస్సిక్ ఐటెం సాంగ్ మిలియన్లలో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతోంది. అంతకుముందు లాంచ్ చేసిన పుష్ప పుష్ప పుష్ప సాంగ్, సూసేకి అగ్గిరవ్వ మాదిరి పాట ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అదే జోష్ తో మేకర్స్ రీసెంట్ గా పీలింగ్స్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ ఒకెత్తు.. పీలింగ్స్ పాట మరో ఎత్తు అని అంతా కొనియాడారు. ఇప్పుడు ముందుగానే ప్రకటించినట్లు మేకర్స్.. ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగా ఇప్పుడు పీలింగ్స్ సాంగ్ ఫుల్ మాస్ బీట్ తో అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెగ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.
ఆరింటకొక సారి.. ఏడింటకొక సారి అంటూ సాగుతున్న పీలింగ్స్ తెలుగు వెర్షన్ ను శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీ దాస ఆలపించారు. దేవి శ్రీ ప్రసాద్ తన మార్క్ బీట్స్ తో అలరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో మెప్పించారు. రష్మిక, బన్నీ ఎనర్జీ అయితే చెప్పనక్కర్లేదు. ఒకరికి ఒకరు పోటీ పడి మరీ చిందులేశారు.
లిరికల్ వీడియోలో అల్లు అర్జున్, రష్మికకు చెందిన దాదాపు డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ చూపించి మరింత బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. గతంలో వచ్చిన సాంగ్స్ లో స్టెప్పులు కాస్త తక్కువే ఉన్నా.. ఈ పాటలో వేరే లెవెల్ లో ఉన్నాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. మరి సిల్వర్ స్క్రీన్ పై పీలింగ్స్ సాంగ్ కు ఈలలు పక్కా.