తాప్సి క్రేజీ సీక్వెల్.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..

తాప్సి, విక్రాంత్ మస్సే లీడ్ రోల్ లో 2021లో వచ్చిన హసీనా దిల్ రుబాకి నెట్ ఫ్లిక్స్ లో విపరీతమైన ఆదరణ లభించింది.

Update: 2024-08-10 09:30 GMT

తాప్సి, విక్రాంత్ మస్సే లీడ్ రోల్ లో 2021లో వచ్చిన హసీనా దిల్ రుబాకి నెట్ ఫ్లిక్స్ లో విపరీతమైన ఆదరణ లభించింది. మూవీకి ఏవరేజ్ టాక్ వచ్చిన కూడా ఓటీటీలో మాత్రం ఆ టైంలో మూవీ హైయెస్ట్ వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఆ సినిమా తెరకెక్కింది. తాప్సి, విక్రాంత్ భార్య భర్తలుగా మొదటి పార్ట్ లో నటించారు. హసీనా దిల్ రుబాకి సీక్వెల్ గా ప్యార్ అయి హసీనా దిల్ రుబా మూవీ వచ్చింది. ఇందులో కూడా విక్రాంత్ పాత్ర ఉంటుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ నెరేషన్స్ లోనే ఆయన క్యారెక్టర్ ఉంటుంది.


డైరెక్ట్ ఓటీటీలోనే ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి సినిమా మీద ఉన్న హైప్ కారణంగా ఈ సీక్వెల్ కి కూడా ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి అటెన్షన్ క్రియేట్ అయ్యింది. తాప్సికి కూడా ఈ మధ్య సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ సీక్వెల్స్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఆగష్టు 9న రిలీజ్ అయిన ప్యార్ అయి హసీనా దిల్ రుబాకి పబ్లిక్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్, తో పాటు ఇంటరెస్టింగ్ ట్విస్ట్ లు ఉన్నాయని అంటున్నారు.

సినిమా కథలోకి వెళ్తే రాణి, రిషబ్ వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి వారి ఐడెంటిటీ మార్చుకొని హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. సీక్రెట్ గా కలుస్తూ వేరొక దేశం వెళ్లిపోవాలని అనుకుంటారు. నీల్ మేనమామ ఈ కేసు అనుమానాలు వ్యక్తం చేయడంతో మరల కేసుని రీఓపెన్ చేస్తారు. దీంతో వారి ప్లాన్ తలక్రిందులు అవుతుంది. తరువాత కథ ఇంటరెస్టింగ్ కోణంలోకి వెళ్తుంది. ఊహించని ట్విస్ట్ లతో సాగుతుంది.

ఈ కథని కూడా జయప్రద్ దేశాయ్ ప్రెజెంట్, ఫాస్ట్ కలిపిన కథనంతో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మొదటి సినిమాలో పండినంత థ్రిల్ ఈ సినిమాలో పండలేదనే మాట వినిపిస్తోంది. సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువగా తీసుకొని, విపరీతమైన ట్విస్ట్ లతో కథని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసేశారనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వస్తోంది. అయితే ఓటీటీలో కాబట్టి ఒకసారి చూడొచ్చని కొంతమంది అంటున్నారు.

ట్విస్ట్ లు బాగున్నాయని, చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో స్టోరీని నేరేట్ చేశారనే పాజిటివ్ టాక్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తోంది. ఈ సినిమాలో తాప్సి మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించిందనే మాట వినిపిస్తోంది. అలాగే విక్రాంత్ కూడా మంచి సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడని అంటున్నారు. మ్యూజిక్ కూడా బాగుందనే టాక్ వస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సీక్వెల్ కి మిక్స్డ్ టాక్ వస్తోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులు చూడటానికి కావాల్సినంత కంటెంట్ ఉంది. మరి ఈ ఫ్లోలో ప్యార్ అయి హసీనా దిల్ రుబా ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Tags:    

Similar News