సల్మాన్ కోసం పోలీసులకు మరో మెసేజ్... ఫోటో గ్రాఫర్లు కీలక నిర్ణయం!
ఎన్సీపీ నేత, సల్మాన్ స్నేహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఎన్సీపీ నేత, సల్మాన్ స్నేహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ముంబై మహానగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ సమయంలో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. అయితే అదే నెంబర్ నుంచి ఇప్పుడు "సారీ" మెసేజ్ వచ్చింది!
అవును... బాబా సిద్ధిఖ్ హత్య అనంతరం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ నిందితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు ముంబై పోలీసులకు వాట్సప్ మెసెజ్ పంపించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో మెసేజ్ వచ్చింది.
ఇందులో భాగంగా... ముంబై ట్రాఫిక్ పోలీసులకు తాజాగా మరో మెసెజ్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేదంటే, సిద్ధీఖ్ కంటే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్టోబర్ 18న హెచ్చరించిన నెంబర్ నుంచి అక్టోబర్ 21న మరో మెసేజ్ వచ్చింది.
అయితే తాజాగా వచ్చిన ఈ మెసేజ్ అక్టోబర్ 18న వచ్చిన మెసేజ్ కు పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో భాగంగా... సల్మాన్ కు బెదిరింపు మెసెజ్ పంపి తప్పుచేశానని.. తనను క్షమించాలని ఆ మెసేజ్ లో పేర్కొన్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు! ఇదే సమయంలో ఈ మెసేజ్ లు ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.
ఇలా తమకు వస్తోన్న మెసేజ్ లను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ సమయంలో ఈ మెసేజ్ లు పంపుతున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఝార్ఖండ్ వెళ్లినట్లు చెబుతున్నారు. మొన్న ఎందుకు బెదిరించాడు.. ఇప్పుడు ఎందుకు సారీ చెబుతున్నాడనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఫోటో గ్రాఫర్లు కీలక నిర్ణయం!:
సల్మాన్ ఖాన్ కు వస్తోన్న వరుస బెదిరింపుల నేపథ్యంలో ఫోటో గ్రాఫర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితి సద్దుమణిగే వరకూ సల్మాన్ ఖాన్ ఫోటోలు తీయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో.. అతనికి సంబంధించిన ఎటువంటి అప్ డేట్ కూడా షేర్ చేయకూడదని.. ఫోటోలు బయటకు రాకూడదని నిర్ణయించారు.