SSMB 29: జక్కన్న కొత్త రూల్.. మహేష్ కూడా ఫాలో అవ్వాల్సిందే..

సినిమా షూటింగ్ సెట్స్ అంటే సాధారణంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ కనిపించడం కామన్. కానీ, ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది.

Update: 2025-02-16 11:30 GMT

సినిమా షూటింగ్ సెట్స్ అంటే సాధారణంగా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్ కనిపించడం కామన్. కానీ, ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటుంది. కేవలం కథ, విజువల్స్ మాత్రమే కాదు, సెట్ డిసిప్లిన్‌లో కూడా జక్కన్న తన మార్క్ చూపిస్తాడు. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB 29 సెట్స్‌లో రాజమౌళి మరో కొత్త రూల్ పెట్టాడని టాక్. అది ఏంటంటే, షూటింగ్ లొకేషన్‌లో ప్లాస్టిక్ బాటిల్స్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం.. ఈ నిర్ణయం వల్ల నిర్మాతలకు 2 కోట్లు వరకు ఖర్చు తగ్గిందని సమాచారం.

ఈ రూల్‌తో కేవలం మహేష్ బాబే కాదు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఫాలో అవ్వాల్సిందే. అలాగే రాబోయే హాలీవుడ్ నటీనటులు కూడా ఈ రూల్‌ను పాటించనున్నారు. ప్లాస్టిక్ నిషేధంతో పాటు, అందరికీ గాజు బాటిల్స్ అందుబాటులో ఉంచి, వాటిని మళ్లీ ఉపయోగించేలా చేశారు. ఇది కేవలం ఒక డిసిప్లిన్ మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా పెద్ద ముందడుగు.

ఈ నిర్ణయం వల్ల పెద్ద మొత్తంలో ఖర్చు తగ్గించుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. SSMB 29 షూటింగ్‌లో ప్రతిరోజూ 2000 మందికి పైగా పని చేస్తున్నారు. వీరందరికీ రోజూ ప్లాస్టిక్ బాటిల్స్ అందించడమనేది లాజిస్టిక్ పరంగా చాలా పెద్ద బాధ్యత. పైగా, వాటిని వాడిన తర్వాత వేసేయడం వల్ల మళ్లీ వ్యర్థాల నిర్వహణ ఓ పెద్ద సమస్య అవుతుంది. దీంతో, గాజు బాటిల్స్ ఉపయోగించడమే సరైన నిర్ణయమని రాజమౌళి భావించారు.

ఇది కేవలం షూటింగ్ లొకేషన్ వరకే పరిమితం కాకుండా, సినీ ఇండస్ట్రీలో కూడా మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, పెద్ద ఎత్తున అమలు చేయడం కష్టమవుతోంది. ఇలాంటి నిర్ణయాలు ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా తీసుకుంటే, షూటింగ్ లొకేషన్లలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించవచ్చని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సంగీత దర్శకుడు కీరవాణి భార్య వల్లి.. జక్కన్న ప్రతీ సినిమాల్లో లైన్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తూ వస్తున్నారు. ఆమె వల్లే ఈ రూల్ అమలు చేయబడ్డట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో అన్నీ క్రమశిక్షణగా నడవడానికి ఆమె పాత్ర కూడా కీలకం. ఈ రూల్ మహేష్ బాబు సహా అందరూ పాటిస్తుండటంతో, మిగిలిన చిత్ర యూనిట్లకు కూడా ఇది ఓ ఇన్స్పిరేషన్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి సెట్స్‌లో ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. ఈ మార్పుతో మహేష్ బాబు, రాజమౌళి సహా, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న వారందరూ తమ వంతు బాధ్యతను నెరవేర్చినట్టే.

Tags:    

Similar News