ఉబకాయంపై ఉద్యమం.. చిరు-రజనీకి లాల్ పిలుపు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాని వివిధ రంగాలకు చెందిన పది మంది పాపులర్ వ్యక్తులను ప్రధాని ఎన్నుకున్నారు.
మోహన్‌లాల్‌తో పాటు, నామినీలలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, భోజ్‌పురి గాయకుడు నటుడు నిరాహువా, షూటింగ్ ఛాంపియన్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్ .. పరోపకారి - ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను కల్పించాలని నేను ఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. మన ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరూ 10 మందిని నామినేట్ చేయాలని కూడా ప్రధాని కోరారు.
ఇప్పడు మోదీ పిలుపును అందుకుని మోహన్ లాల్ మరో పది మందిని నామినేట్ చేసారు. లాల్ నామినేట్ చేసిన పేర్లలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. ఊబకాయం సమస్యను నివారించే ఉద్యమంలో తనను నాయకుడిగా ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలియజేసారు. నూనెల వాడకాన్ని తగ్గించే ఉద్యమంలో మరో పది మందిని నేను నామినేట్ చేస్తున్నాను అని లాల్ తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి, రజనీ కాంత్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఉన్ని ముకుందన్, టోవినో థామస్ సహా లాల్ నామినేట్ చేసిన పది మంది మరో పది మందిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ఒక ఉద్యమంలా అన్ని పరిశ్రమలను చుట్టేస్తోంది. ప్రధాని తీసుకున్న ఈ ఛాలెంజ్ ని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఆదివారం నాడు తన `మన్ కీ బాత్` ప్రసారంలో భాగంగా ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించి, దానిని మరో 10 మందికి అందజేసే సవాలును స్వీకరించమని ప్రధాని సహా సెలబ్రిటీలు ప్రజలను ప్రోత్సహించారు.