యూట్యూబర్ హర్షసాయిపై రే*ప్ కేసు.. ఏం జరిగిందంటే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ యూట్యూబర్ హర్షసాయి ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2024-09-25 04:33 GMT

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ యూట్యూబర్ హర్షసాయి ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం సాయంత్రం, ఒక యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హర్షసాయిపై పలు ఆరోపణలు చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఫిర్యాదులో హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, అలాగే రెండు కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆమె పేర్కొంది.

అదేవిధంగా, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు గురి చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీసు అధికారులు హర్షసాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, కేసు దర్యాప్తులో ఉన్నట్లు చెబుతూ ఆధారాలు సమర్పించేందుకు బాధితురాలికి నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు.

హర్షసాయి సామాన్యులకు ఆర్థిక సహాయం చేసి, యూట్యూబ్‌లో 'మానవత్వం' అనే పేరుతో పాపులారిటీ సంపాదించాడు. అయితే, అతనిపై అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం హర్షసాయి ఒక పాన్-ఇండియా మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో మరిన్ని వివరాల్లోకి వెళితే.. పిర్యాదు ఇచ్చిన యువతి మహారాష్ట్రకు చెందిన అమ్మాయిగా గుర్తించారు. గతంలో హర్షసాయి ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఈ పరిచయం వల్లనే వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. సదరు యువతి హర్షసాయి పై పెట్టిన ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నార్సింగ్ పోలీసులు కేసును విచారణలో ఉంచారు, అయితే ఈ అంశంపై ఇంకా హర్షసాయి స్పందించలేదు. తెలుగులో అత్యధిక స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్స్ లలో హర్ష సాయి ఒకరు. తాను ఎలాంటి వీడియో పోస్ట్ చేసిన కూడా కోట్లల్లో వ్యూవ్స్ వస్తుంటాయని.. ఇక ఆ డబ్బు ద్వారా తాను సమజాసేవ చేస్తున్నాను అంటూ గతంలో హర్షసాయి తెలిపారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై కూడా హర్షసాయి విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ విషయంలో అతని వెనక్కి తగ్గలేదు. మరి ఈ కేసు విషయంలో అతను ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News