అతడు ఒక పిచ్చోడు.. ఊపిరి పీల్చుకున్న స్టార్
కొన్ని గంటల్లోనే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ వచ్చిన సందేశం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తించారు.;

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల 'సికిందర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో సినిమాకు మినిమం వసూళ్లు కూడా దక్కలేదని సమాచారం అందుతోంది. ఇప్పటికే వరుస సినిమాలు డిజాస్టర్స్‌గా నిలుస్తున్న బాధలో ఉన్న సల్మాన్ ఖాన్‌ని, ఆయన అభిమానులను చంపేస్తాం అంటూ వచ్చిన హెచ్చరిక మరింత ఆందోళన కలిగించింది. ఒక వ్యక్తి ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాను, ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరుపుతాను లేదంటే కారుకు బాంబు పెట్టి మరీ చంపబోతున్నాను అంటూ ఒక సందేశం పంపించాడు. దాంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
కొన్ని గంటల్లోనే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ వచ్చిన సందేశం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తించారు. సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్ గుజరాత్‌కి చెందిన 26 ఏళ్ల వ్యక్తి పంపించినట్లు గుర్తించారు. గుజరాత్‌లోని వడోదర జిల్లాకు చెందిన వ్యక్తి మొబైల్ నుంచి వాట్సప్ ద్వారా మెసేజ్ వెళ్లింది. అతడి గురించి ఎంక్వౌరీ చేసిన పోలీసులకు షాకింగ్ విషయం తెల్సిందే. అతడు ఒక మానసిక రోగి అని, అతడు గత కొన్నాళ్లుగా మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాడు అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడు ఎందుకు అలా చేశాడు అనేది క్లారిటీ లేదు. ఆ విషయాన్ని అతడు కూడా చెప్పలేక పోతున్నాడు. పెద్దగా అతడికి బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు.
కేవలం పాపులారిటీ కోసం, గుర్తింపు కోసం అతడు అలా చేసి ఉంటాడు అనేది కొందరు భావిస్తున్నారు. పోలీసులు కూడా అదే విషయాన్ని నిర్ధారించే అవకాశం ఉంది. మానసిక సమస్యతో బాధ పడుతున్న అతడు ముందు ముందు ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన అభిమానులు గత రెండు మూడు రోజులుగా చాలా ఆందోళనకు గురి అయ్యారు. పోలీసులు తాజాగా అతడు ఒక పిచ్చోడు అని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ పోలీసుల నుంచి స్పష్టత రావడంతో ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు.
సికిందర్ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా నచ్చక పోవడంతో హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ బెదిరించి ఉంటాడేమో అంటూ కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. మరి కొందరు ఇకపై అయినా సినిమాలు మానేయమంటూ చంపేస్తానని బెదిరించారేమో అంటూ కామెంట్ చేశారు. గతంలోనూ సల్మాన్ ఖాన్‌కి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా ఆయన ఇంటి సమయంలో కాల్పులు సైతం జరిగాయి. అందుకే సల్మాన్ ఖాన్‌ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. చివరకు అతడు పిచ్చోడు అని నిర్ధారణ కావడంతో లైట్ తీసుకున్నారు. ఈ కేసు విచారణ ఇంతటితో ఆపేస్తారా ముందుకు తీసుకు వెళ్తారా అనేది చూడాలి.