పూనమ్ పాండే పై పోలీస్ కేసు
బాలీవుడ్ నటి పూనమ్ పాండే..ఆమె మేనేజర్ పై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలీవుడ్ నటి పూనమ్ పాండే..ఆమె మేనేజర్ పై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు కథనాలతో తమ మనోభావాలు దెబ్బ తినేలా చేసిందని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆమె చేసిన పనికి చట్టపరంగా చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి పనులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో రాసినట్లు తెలుస్తోంది. ఇక పూనమ్ పాండ్ చేసిన ఘనకార్యం గురించి తెలిసిందే. తాను చనిపోయానని ప్రజల్ని నమ్మించి ఎలాంటి సానుభూతి పొందిందో విధితమే.
క్యాన్సర్ తో చనిపోయినట్లు మేనేజర్ తో చెప్పించి ప్రేక్షకాభిమానుల్ని తప్పుదోవ పట్టించింది. మహిళల్లో గర్భాశయ క్యానర్ అవేర్ నెస్ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి ప్రచారానికి తెర తీసినట్లు వెల్లడించడంతో సోషల్ మీడియా వేదికగాపై పూనమ్ పాండే పై ఒక్కసారిగా నెటి జనులు భగ్గుమన్నవైనం తెలిసిందే. చనిపోయిందని దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన నెటి జనులు అదే నోటితో అక్షింతలు వేయించుకునేలా ప్రవర్తించింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి పనులకు పాల్పడిందని..ఎంతో మంది మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆమెను కఠినంగా శిక్షించాలని నెటి జనులు కోరుతున్నారు.
మరి వర్కర్స్ యూనియన్ చేసిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి కేసుగా ఫైల్ చేస్తారా? లేక ఇక్కడితో వివాదం ఎందుకుని సర్దిచెప్పి పంపిస్తారా? అన్నది చూడాలి. ఇక పూనమ్ పాండే తీరుపై రాంగోల్ వర్మ కూడా తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. 'హేయ్ పూనమ్ పాండే... గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నీవు ఎంచుకున్న విధానం కొంత విమర్శలకు తావివ్వొచ్చు. కానీ ఈ కల్పిత ప్రచారం ద్వారా నీవు సాధించిన దాన్ని.. నీ మంచి ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పుడు అంతటా గర్భాశయ క్యాన్సర్ పైనే చర్చ జరుగుతోంది. నీ మాదిరే నీ ఆత్మ కూడా చాలా అందమైనది. సంపూర్ణమైన సంతోషకరమైన జీవితం నీకు ఉండాలని కోరుకుంటున్నట్లు' ట్వీట్ చేసాడు.