సూర్య హౌస్ కు సర్కార్ సెక్యూరిటీ.. ఎందుకలా?

సినిమా రిలీజ్ అయ్యాక తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఆయా సీన్స్ ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపణలు చేసింది.

Update: 2024-05-17 13:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. తన ఫ్యాన్స్ కోసం ఎలాంటి ప్రయోగాలు చేస్తారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సూర్య.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టారు. కంగువతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. సుధా కొంగర డైరెక్షన్ లో రివెంజ్ డ్రామా, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పీరియాడిక్‌ జోనర్ లో చిత్రాలు చేస్తున్నారు. దీంతోపాటు పాన్ ఇండియా మూవీ కర్ణ కూడా త్వరలో స్టార్ట్ కానుంది.

అయితే సూర్య ఇంటికి పోలీసులు కొన్నేళ్లుగా భద్రత కల్పిస్తున్న విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. రెండున్నర సంవత్సరాల నుంచి తమిళనాడు సర్కార్.. ప్రభుత్వ ఖర్చుతో చెన్నైలోని సూర్య ఇంటికి రక్షణ కల్పిస్తోంది. దీంతో ఇది కరెక్ట్ కాదని కొందరు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. సూర్య డబ్బులు చెల్లిస్తున్నారో కూడా తెలియదని చెబుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఇంట్లో సూర్య ఫ్యామిలీ ఉండడం లేదు.

మూడేళ్ల క్రితం సూర్య జై భీమ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సూర్య, జ్యోతిక, డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కలిసి రూపొందించిన ఆ మూవీలో కొన్ని సీన్స్ పట్ల అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యాక తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఆయా సీన్స్ ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపణలు చేసింది. తమ సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణలు చెప్పి, రూ.5 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది.

ఆ సమయంలో శాంతిభద్రతల దృష్ట్యా తమిళనాడు సర్కార్.. సూర్య ఇంటికి భద్రత కల్పించింది. ఐదుగురు పోలీసులను సెక్యూరిటీగా నియమించింది. అయితే జై భీమ్ మూవీ వచ్చి చాలా నెలలు గడిచింది. దాంతోపాటు ఆ ఇంట్లో సూర్య ఫ్యామిలీ ఉండటం లేదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం సూర్య ఇంటికి ఎందుకు రక్షణ కల్పిస్తుందోనని ఇటీవల చర్చ మొదలైంది. దీంతో ఇదే విషయంపై రీసెంట్ గా సోషల్ వర్కర్ కృష్ణమూర్తి.. ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్ రక్షణకు ఎవరి ఆదేశాలు ఉన్నాయని కూడా దరఖాస్తులో ప్రశ్నించారు.

దీంతో సంబంధిత పోలీస్ కమిషనర్.. కృష్ణమూరి దరఖాస్తుకు సమాధానమిచ్చారు. 2021 నవంబర్ 15వ తేదీన తాత్కాలిక భద్రత కల్పించామని తెలిపారు. ఆ తర్వాత సూర్యకు ప్రమాదం ఉన్న కారణంగా అదే రక్షణను ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నామని వెల్లడించారు. అంతే కాకుండా ప్రభుత్వ ఖర్చుతోనే భద్రత కల్పిస్తున్నట్లు కూడా పరోక్షంగా తెలిపారు. ఎందుకంటే తన ఇంటి భద్రతకు సూర్య డబ్బులు చెల్లిస్తున్నారా లేదా అన్న ప్రశ్నకు అధికారులు సమాధానమివ్వలేదు. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారగా.. మరి సూర్య, జ్యోతిక ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News