చిరంజీవి సినిమాకి రోజుకి 1000 రూపాయలు తీసుకునేవాడిని!
తాజాగా నేడు చిరంజీవి పుట్టిన రోజు సంద్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తూ గత విషయాలు తలుచుకునే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా రివీల్ చేసారు.
తమిళ నటుడు పొన్నాంబళం గురించి పరిచయం అసవరం లేదు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన నటుడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో ఆయన నటించిన సినిమాలెన్నో. చిరుకు పొన్నంబళం మంచి విలన్ కాంబినేషన్. 'ఘరానా మొగుడు', 'హిట్లర్', 'అల్లరి మొగుడు', సహా పలు సినిమాల్లో తన విలనిజంతో ఆకట్టుకున్నారు.
అలా చిరంజీవితో పొన్నబళం మధ్య సాన్నిహిత్యం ఉంది. ఈ సందర్భంగానే పొన్నబళం కొన్నేళ్లు క్రితం కిడ్నీ సమస్య కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సమయంలో చిరంజీవి ఆర్దిక సహాయం చేసారు. దాదాపు 60 లక్షవరకూ వైద్యానికి ఖర్చు చేసారు. దీంతో పొన్నంబళం చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నాడు.
ఆ సమయంలో తాను నమ్ముకున్న వాళ్లే నట్టేటా ముంచారని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి చేసిన సహాయం వల్లే ఈ రోజు తాను బతికి బట్టకట్టినట్టు చెప్పుకొచ్చారు. తాజాగా నేడు చిరంజీవి పుట్టిన రోజు సంద్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తూ గత విషయాలు తలుచుకునే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా రివీల్ చేసారు. 'ఆ రోజుల్లో ఫైటర్స్ కి రోజుకు 350 రూపాయలు ఇచ్చేవారు.
కానీ చిరంజీవి గారు మాత్రం షూటింగ్ కి వెళ్తే 1000 రూపాయలు ఇచ్చేవారు. అంత డబ్బు నేను ఏనటుడి సినిమాకి ఎప్పుడూ అందుకోలేదు. తొలిసారి చిరంజీవి గారు సినిమా కారణంగానే వచ్చేది. అనారోగ్యానికి గురైనప్పుడు 60 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆయన జీవితంతో ఎంతో సంతోషంగా ఉండాలి. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి' అని అన్నారు.