తండ్రితో లిప్ లాక్.. త‌ప్పు కాద‌ని వాదిస్తున్న న‌టి..

ఇటీవ‌ల‌ బిగ్ బాస్ OTT సీజ‌న్ 2లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన పూజా భ‌ట్.. జీవితంలో ఒక అరుదైన క్ష‌ణం గురించి చాలా అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొంది.

Update: 2025-01-21 00:30 GMT

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో న‌టిస్తూ బోల్డ్ న‌టి పూజా భట్ రెగ్యుల‌ర్‌గా వార్త‌ల్లో నిలుస్తున్నారు. పూజా ఎల్లప్పుడూ బాలీవుడ్ గాసిప్ కాలమ్‌లో హెడ్ లైన్స్‌లో నిలిచే రోజులు కావు కానీ, న‌టిగా రెగ్యుల‌ర్ గా వార్త‌ల్లోకొస్తోంది. ఇటీవ‌ల‌ బిగ్ బాస్ OTT సీజ‌న్ 2లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన పూజా భ‌ట్.. జీవితంలో ఒక అరుదైన క్ష‌ణం గురించి చాలా అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొంది.

ఒక తండ్రి త‌న కూతురు నుదుటిపై సుతారంగా ముద్దు పెడ‌తాడు.. లేదా బుగ్గ‌పై ఒక పెక్ ఇస్తాడు.. అది తండ్రి ప్రేమ‌.. అంతేకానీ ఘాడంగా పెద‌వి ముద్దు లాగించేస్తాడా? కానీ అలాంటి ఒక పెద‌వి ముద్దుతో నాడు సంచ‌ల‌నంగా మారారు తండ్రి కూతుళ్లు మ‌హేష్ భ‌ట్‌- పూజా భ‌ట్. త‌న తండ్రి మ‌హేష్ భ‌ట్‌ని పూజా భ‌ట్ పెద‌వి ముద్దు పెట్టుకున్న ఫోటోషూట్ నాడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత అయిన మ‌హేష్ భ‌ట్, అగ్ర క‌థానాయిక అయిన పూజా భ‌ట్ లిప్ లాక్‌పై నాడు తీవ్ర దుమారం చెల‌రేగింది. ప్ర‌జ‌లంతా ఇదేమి చోద్యం? అంటూ తూల‌నాడారు. అయితే నాటి వివాదాస్ప‌ద క‌వ‌ర్ పేజీ ఇప్ప‌టికీ పెద్ద డిబేట‌బుల్ అంశం. ఆ ఫోటోగ్రాఫ్ ఇప్ప‌టికీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతూనే ఉంది. దీనిపై తాజా ఇంట‌ర్వ్యూలో పూజా భ‌ట్ మ‌రోసారి స్పందించారు.

మహేష్ భట్ - పూజా భట్ లిప్ కిస్ 1994 మ్యాగజైన్ కవర్ ఫోటోగా ప్ర‌చురితం కాగా, దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోయారు. తండ్రీకూతుళ్లు లిప్ లాక్ వేయడం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఆ త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో పూజా భ‌ట్ దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. పూజా మాట్లాడుతూ..``మీకు పిల్లలు ఉన్నప్పుడు, తరచుగా పిల్లవాడు తల్లిదండ్రులను ముద్దు పెట్టమని అడుగుతాడని షారుఖ్ ఒకసారి నాకు చెప్పినట్లు గుర్తుంది. పిల్ల‌లు అలాగే ఉంటారు. ఈ వయస్సులో కూడా... నేను ఇప్పటికీ నా తండ్రికి 10-పౌండ్ల ప‌సిపిల్ల‌ను. అతడు నాకు ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. అది ఒక అమాయకమైన మూవ్ మెంట్.. ఇది చాలా విధాలుగా ప్ర‌జ‌ల‌కు అర్థమైంది. వారంతా తమకు నచ్చినది చేస్తారు.. నేను ఇక్కడ కూర్చుని దానిని సమర్థించను. ఎవరైనా ఇలా తండ్రీకూతుళ్ల బంధాన్ని ప్రశ్నించగలిగితే, వారు చెత్తగా ఆలోచిస్తార‌ని అనుకుంటాను! అని వివ‌రణ ఇచ్చింది పూజాభ‌ట్.

పూజా భట్ .. మహేష్ భట్ కి మొద‌టి భార్య కిర‌ణ్ భ‌ట్ కుమార్తె. ఆ తర్వాత 1986లో నటి సోనీ రజ్దాన్‌ను మ‌హేష్ భ‌ట్ వివాహం చేసుకున్నారు. మ‌హేష్ భ‌ట్- సోని ర‌జ్దాన్ జంట‌కు ఇద్దరు కుమార్తెలు. అలియా భట్, షాహీన్ భట్ అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పూజా భట్ చివరిసారిగా బిగ్ బాస్ OTT 2లో పోటీదారుగా కనిపించింది. షో నుండి తొలగిపోయిన‌ మొదటి ఫైనలిస్ట్ ఆమె. అలాగే OTT అరంగేట్రం `బాంబే బేగమ్స్‌`తో పూజా భ‌ట్ అద్భుతమైన పునరాగమనాన్ని చాటుకుంది. ప్ర‌స్తుతం స్టార్ హీరో సునీల్ శెట్టితో క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తోంది. పూజా భ‌ట్ టాలీవుడ్ లో ను న‌టించింది. నాగార్జున స‌ర‌స‌న ఓ హిందీ చిత్రంలో న‌టించింది.

Tags:    

Similar News