బుట్ట‌బొమ్మ డ‌బుల్ గేమ్ ఇంట్రెస్టింగ్!

ఇంత‌కాలం బాలీవుడ్ లో అవ‌కాశాలు రాక మ‌ళ్లీ కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల‌పై దృష్టి పెడుతుంద‌నుకున్నారంతా.

Update: 2024-12-10 03:59 GMT

టాలీవుడ్ అవ‌కాశాల్ని కాద‌ని బాలీవుడ్ కి వెళ్లింది పూజాహెగ్డే. కానీ అక్క‌డ కెరీర్ ఆశించి విధంగా సాగ‌క‌పోవ‌డంతో వెంట‌నే మ‌ళ్లీ సౌత్ ఇండ‌స్ట్రీ కి కంబ్యాక్ అయింది. ఈ ప్రోస‌స్ లో మ‌ళ్లీ సౌత్ నుంచి అవ‌కాశం రావ‌డం అన్న‌ది అంత చిన్న విష‌యం కాదు. కానీ పూజా మాత్రం వాట‌ని తెలివిగా ఒడిసి ప‌ట్టుకుంటుంది. త‌మిళ్ తో పాటు తెలుగు సినిమాలు కొన్నింటిని చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్, సూర్య‌, నాగ‌చైత‌న్య లాంటి స్టార్ హీరోల చిత్రాల్లోనే న‌టిస్తుంది.

ఇలాంటి స‌మ‌యంలో ఏ న‌టి అయినా సౌత్ ఇండ‌స్ట్రీపైనే మ‌రింత శ్ర‌ద్ద పెట్టి ప‌నిచేస్తుంది. కొత్త అవ‌కాశాలు ఎలా అందుకోవ‌డంలో కొత్త స్ట్రాట‌జీతో ముందుకెళ్తారు. కానీ బుట్ట‌బొమ్మ మ‌త్రం డ‌బుల్ గేమ్ ఆడుతుంది. ఈడ ఉంటా? ఆడా ఉంటానంటూ ఏకంగా మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో అవ‌కాశాలు అందుకుంటుంది. తాజాగా మ‌ళ్లీ బాలీవుడ్ చిత్రాల‌కు సైన్ చేస్తుంది. ప్ర‌స్తుతం 'దేవా' అనే చిత్రం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌రో కొత్త ప్రాజెక్ట్ లో వ‌రుణ్ ధావ‌న్ కి జోడీగా న‌టించ‌డానికి ఒప్ప‌దం చేసుకుంది.

ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. డేవిడ్ ధావ‌న్ దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ కీల‌క పాత్ర పోషిస్తుంది. 'హై జ‌వానీతో ఇష్క్ హైనా హై' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభించ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అంతేనే బాలీవుడ్ లో మ‌రో యువ హీరో సినిమాకి బుట్ట‌బొమ్మ ఒప్పందం చేసుకుం ద‌ని వార్త‌లొస్తున్నాయి. అంటే? అమ్మ‌డు ఏ ఇండ‌స్ట్రీని విడిచి పెట్ట‌లేదు అన్న విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంది.

ఇంత‌కాలం బాలీవుడ్ లో అవ‌కాశాలు రాక మ‌ళ్లీ కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల‌పై దృష్టి పెడుతుంద‌నుకున్నారంతా. కంటున్యూగా ఇక్క‌డే సినిమాలు చేస్తుంద‌ని...బాలీవుడ్ కి వెళ్లే అవ‌కాశ‌మే లేద‌ని అనుకున్నారంతా. కానీ ముంబై బ్యూటీ ప్లానింగ్ మాత్రం యూనిక్ అని ప్రూవ్ చేసింది. ఆల‌స్య‌మైనా ఎక్క‌డిక‌క్కడ కొత్త అవ‌కాశాలు సృష్టించు కుంటూ ముందుకు వెళ్తుంది.

Tags:    

Similar News