2025 లో పూజాహెగ్డే తుఫాన్ లా!
దుల్కర్ సల్మాన్ సరసన నటించడానికి ఓ సినిమాకి అమ్మడు సైన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
టాలీవుడ్ ని కాదని బాలీవుడ్ కి వెళ్లిన పూజాహేగ్డే అలియాస్ బుట్టబొమ్మ ఎంత వేగంగా వెళ్లిందో? అంతే వేగంగా మళ్లీ పెవీలియన్ చేరిన సంగతి తెలిసిందే. లక్కీగా అమ్మడు అక్కడ ఎక్కువ సమయం వృద్ధా చేయకుండా సౌత్ ఇండస్ట్రీకి తిరిగి వచ్చింది. సాధారణంగా ఇలా వెళ్లి వచ్చిన వారికి తిరిగి అవకాశాలు ఇవ్వడం అన్నది అంత వీజీ కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆవిషయంలో బుట్టబొమ్మ లక్కీ గాళ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కంబ్యాక్ లో స్టార్ హీరోలతోనే అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో నాగచైతన్యతో ఓ సినిమాకి సైన్ చేసింది. కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ ఈ అమ్మడే హీరోయిన్. దళపతి విజయ్ 69వ చిత్రంలో సైతం పూజానే హీరోయిన్. ఇవి చేతిలో అధికారికంగా ఉన్న ప్రాజెక్ట్ లు. అనధికారంగా ఇంకా మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయినట్లు సమాచారం. తాజాగా అమ్మడు మాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
దుల్కర్ సల్మాన్ సరసన నటించడానికి ఓ సినిమాకి అమ్మడు సైన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని డీక్యూ తన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా చిత్రంగా భావిస్తున్నాడు. అలాంటి ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మకు ఛాన్స్ రావడం అంటే ఎంత లక్ అన్నది అర్దమవుతుంది. 'దసరా' చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఎల్ వీ సినిమాస్ నిర్మిస్తుంది. ఇదే చిత్రంతో రవి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నట్లు తెలిసింది.
మలయాళం, తెలుగులో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారుట. మరోవైపు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కి జోడీగా ' దేవా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు రోషన్ అండ్రూస్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమ్మడు శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ లో పూజా కూడా యాక్షన్ సీక్వెన్స్ లో అలరిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలన్నీ దాదాపు వచ్చే ఏడాది విడుదలయ్యేవే. అంటే 2025లో బుట్టబొమ్మ సందడి షురూ అన్న మాట.