డీ గ్లామ‌ర్ బ్యూటీగా బుట్ట‌బొమ్మ‌!

రాఘ‌వ లారెన్స్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తోన్న `కాంచ‌న 4`లో పూజాహెగ్డే ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ఆమె పాత్ర ఎలాంటిది అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ రాలేదు.;

Update: 2025-02-28 05:56 GMT

ఇప్ప‌టి వ‌ర‌కూ పూజా హెగ్డే వెండి తెర‌పై అంద‌మైన బ్యూటీగానే హైలైట్ అయింది. ప్రియురాలు, ప్రేమికురాలి పాత్ర‌ల్లో తెర‌పై ఎంతో అందంగా క‌నిపించింది. తొలి సినిమా `ఒక లైలా కోసం నుంచి `ఆచార్య` వ‌ర‌కూ డీసెంట్ బ్యూటీగా హైలైట్ అయింది. దీంతో డీ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూర‌మ‌వ్వాల్సి వ‌చ్చింది. క‌థ‌ను బ‌ట్టి ర‌క‌ర‌కాల పాత్ర‌లు పోషించింది గానీ డీగ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించే ఛాన్స్ రాలేదు. అయితే తొలిసారి డీగ్లామ‌ర్ పాత్ర‌కు సై అనేసింది.

రాఘ‌వ లారెన్స్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తోన్న `కాంచ‌న 4`లో పూజాహెగ్డే ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ఆమె పాత్ర ఎలాంటిది అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో పూజా హెగ్డే డీగ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అమ్మ‌డు సినిమాలో ఎక్క‌డా మ్యాక‌ప్ లేకుండానే క‌నిపిస్తుందట‌. బాగా వెనుక‌బ‌డిన ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో మాస్ కోణంలో పూజా హెగ్డే రోల్ ఉంటుందట‌.

`గంగ` చిత్రంలో నిత్యామీన‌న్ కంటే మ‌రింత డీగ్లామ‌ర్ గా పూజాహెగ్డే పాత్ర ఉంటుంద‌ని అంటున్నారు. ఇందులో ఆమె బ‌ధిర యువ‌తి పాత్ర పోషిస్తుందట‌. క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర ఇదేన‌ని స‌మాచారం. బ‌ల‌మైన పాత్ర‌లో పూజా హెగ్డే ఆహార్యం స‌హా న‌ట‌న సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. డీగ్లామ‌ర్ పాత్ర‌ల్లో పూజా హెగ్డే ఇంత‌వ‌ర‌కూ ఏ సినిమాలో న‌టించ‌లేదు. అలాంటి ఆహార్యానికి కూడా ఎక్క‌డా ఛాన్స్ తీసుకోలేదు.

ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ లో ఎప్పుడూ మోడ్ర‌న్ గానే క‌నిపించింది. అలాంటి న‌టి తొలిసారి డీగ్లామ‌ర్ పాత్ర పోషించ‌డం అంటే ఓర‌కంగా ఇది అమ్మ‌డికిది పెద్ద స‌వాల్ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇందులో నోరా ప‌టేహీ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె పాత్ర కూడా బ‌లంగా ఉంటుంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News