స్టార్ హీరోయిన్‌కు ఇదే చిట్ట చివరి ఛాన్స్
కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కెరీర్ ని సాగించింది పూజా హెగ్డే. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా నటించింది.
కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కెరీర్ ని సాగించింది పూజా హెగ్డే. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా నటించింది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్య, అఖిల్ సహా టాప్ హీరోలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసారు. అయితే అనూహ్యంగా తన కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది. టాలీవుడ్ లో కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి ముఖం చాటేసాయి. అదే సమయంలో పూజా తన స్టాఫ్ కి జీతభత్యాలు విలాసాల పేరుతో నిర్మాతల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి.
కారణం ఏదైనా టాలీవుడ్ నుంచి పూజా అనూహ్యంగా ఎగ్జిట్ అయింది. కోలీవుడ్ లోను అగ్ర హీరోలు అవకాశాలిచ్చినా కానీ సరైన విజయం దక్కక రేసులో వెనకబడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే నటిస్తోంది. అక్కడ కూడా అరకొర అవకాశాలే. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన `దేవా`లో పూజాకు అవకాశం దక్కింది. ఇందులో షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం లభించింది. కానీ ఇది కూడా తనకు అంతగా కలిసిరాదని అర్థమైపోతోంది.
ఇందులో షాహిద్ డామినేషన్ ముందు ఏదీ నిలబడటం లేదు. ఇతర నటీనటులు అస్సలు కనిపించడం లేదు. అతడు రౌడీ పోలీస్ పాత్రలో ఇరగదీస్తున్నాడు. షాహిద్ గెటప్, డ్యాన్సులు, యాక్షన్, మాసిజం ప్రతిదీ విజువల్ గా హైలైట్ కావడంతో పూజా హెగ్డే అంతగా హైలైట్ కాలేదు. టోన్ డౌన్ గా చూపించడం చూస్తుంటే, ఈసారి కూడా తనకు గుర్తింపు దక్కడం కష్టమనే తేలిపోయింది. ఇటీవల భాసద్ మచ్చా అనే పాటను విడుదల చేశారు. దీనిలో షాహిద్ ఎనర్జిటిక్ స్టెప్పుల ముందు ఇంకేదీ నిలబడలేదు. అతడు బేసిగ్గానే అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో ఇతర పాత్రలు హైలైట్ గా కనిపించడం లేదు. పూజా పాత్రను పూర్తిగా హైడ్ చేసినట్టుగా కనిపిస్తోంది. భారీ యాక్షన్ చిత్రం దేవా విజయం సాధిస్తే, అది పూజాకు మరో అవకాశం ఇస్తుంది. లేదంటే ఇదే చిట్టిచివరి అవకాశంగా భావించాల్సి ఉంటుంది.