వారం రోజులపాటు జిగేల్ రాణితోనే ఆట‌

ముంబై బ్యూటీ పూజాహెగ్డే కంబ్యాక్ నేప‌థ్యంలో కోలీవుడ్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సూర్య కి జోడీగా `రెట్రో`లో న‌టిస్తోంది.

Update: 2025-02-23 10:30 GMT

ముంబై బ్యూటీ పూజాహెగ్డే కంబ్యాక్ నేప‌థ్యంలో కోలీవుడ్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సూర్య కి జోడీగా `రెట్రో`లో న‌టిస్తోంది. త‌ల‌ప‌తి విజ‌య్ 69వ చిత్రంలో అవకాశం అందుకుంది. `కాంచ‌న 4` లోనూ అవ‌కాశం ఒడిసి ప‌ట్టుకుంది. ఇందులో అమ్మ‌డు మెయిన్ లీడ్ పోషిస్తుంది. ఇవిగాక ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న `కూలీ`లోనూ ఐటం భామ‌గా ఎంపికైంది.

ఫాంలో ఉన్న హీరోయిన్లు అంద‌ర్నీ ప‌క్క‌నబెట్టి మ‌రీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ పూజాహెగ్డేని ఎంపిక చేసాడు. ఇప్పుడీ పాట కోసం పూజ సెట్లోకి అడుగు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం ఓ భారీ సెట్ నిర్మించారు. అందులోనే ఈనెల‌ఖ‌రు వ‌ర‌కూ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఈ పాట ఎంతో హుషారుగా సాగుతుందట‌. మాస్ ఆడియ‌న్స్ ని దృష్టిలో పెట్టుకుని పూజ పెర్పార్మెన్స్ ఇస్తుంద‌ని అంటు న్నారు. స్కిన్ షోతో ఆద్యంత అల‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఈ భామ జిగేల్ రాణిగా టాలీవుడ్ లో బాగా ఫేమ‌స్ అయింది. `రంగ‌స్థ‌లం` చిత్రంలో అమ్మ‌డు తొలిసారి ఐటం పాట‌లో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ `ఎఫ్ 3` చిత్రంలో `లైఫ్ అంటే ఇట్టా ఉండాలి అంటూ` ఆటాడుకుంది. కానీ కోలీవుడ్ లో మాత్రం ఇంత‌వ‌ర‌కూ ఐటం పాటల్లో న‌టించ‌లేదు. తొలిసారి ర‌జనీ సినిమాతోనే ఆ ఛాన్స్ వ‌చ్చింది. అక్క‌డ అద‌ర గొడుతుంది? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ప్ర‌స్తుతం పూజాహెగ్గే మ‌కాం ముంబై నుంచి చెన్నైకి మార్చేసింద‌ని స‌మాచారం. `రెట్రో` షూటింగ్ స‌మ‌యం లో ముంబై టూ చెన్నై తిరిగింది. కానీ ఇప్పుడు `జ‌న నాయ‌గ‌న్` తో పాటు,` కాంచ‌న 4` చిత్రీక‌ర‌ణ‌కు హాజ‌ర వుతుంది. ఈ రెండింటికి తోడు ఐటం పాట షూటింగ్ కూడా మొద‌ల‌వ్వ‌డంతో? షిప్ట్ టూ చెన్నై అనేసింది.

Tags:    

Similar News