ఈ సారి బుట్ట‌బొమ్మ 'కావాల‌య్యా' అంటుందా!

`జైలర్` లో `కావాల‌య్య` అంటూ ఐట‌మ్ సాంగ్ లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా? ఏ రేంజులో మురింపించిందో తెలిసిందే.

Update: 2025-02-19 06:01 GMT

`జైలర్` లో `కావాల‌య్య` అంటూ ఐట‌మ్ సాంగ్ లో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా? ఏ రేంజులో మురింపించిందో తెలిసిందే. కావాల‌య్యా కావాల‌య్యా అంటూ కుర్రాళ్ల‌ను ఓ ఊపేసింది. చాలా గ్యాప్ త‌ర్వాత త‌మ‌న్నా విసిరిన హాట్ పంచ్ సినిమాలో బాగా వ‌ర్కౌట్ అయింది. అయితే ఈసారి ఆ ఛాన్స్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే తీసుకునేలా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క త్వంలో `కూలీ` తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో ర‌జనీ కాంత్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో న‌టిస్తు న్నారు. గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. అయితే ఈసినిమా ఓ మాంచి హాట్ ఐటం నెంబ‌ర్ ఒక‌టి లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్లాన్ చేస్తున్నాడుట‌. ఆ పాట‌లో పూజాహెగ్డే న‌టిస్తే బాగుంట‌ద‌ని భావిస్తున్నాడుట‌. దీనిలో భాగంగా ఆమెని అప్రోచ్ అవ్వ‌డం.. పూజా అంగీక‌రించ‌డం కూడా జ‌రిగింద‌ని స‌మాచారం.

సాధార‌ణంగా లోకేష్ సినిమాలో పాట‌లుండ‌వు..ఐటం పాట‌లైతే అస‌లే క‌నిపించ‌వు. కానీ `కూలీ `లో ఇలాంటి పాట ఒక‌టి పెడితే? ప్రేక్ష‌కుడికి కాస్త రిలీఫ్ ఇచ్చిన‌ట్లు ఉంటుంద‌ని పాట ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీల్లో ఐటం పాట‌లుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఐటం భామ‌ని మ‌రింత బోల్డ్ గానూ చూపించే అవ‌కాశం ఉంటుంది. ఆ విష‌యంలో పూజాహెగ్డే ఎక్క‌డా త‌గ్గే పెర్పార్మ‌ర్ కాదు.

ఇప్ప‌టికే ఐటం సాంగ్స్ చేసిన అనుభ‌వం కూడా ఉంది. ప్ర‌స్తుతం అవ‌కాశాలు కూడా అంతంత మాత్రంగా వ‌స్తోన్న నేప‌థ్యంలో పూజా కిది మంచి అవ‌కాశ‌మే. సినిమా హిట్ అయితే పాన్ ఇండియాలోనే ఐడెంటిటీ ద‌క్కుతుంది. ప్ర‌స్తుతం సూర్య హీరోగా న‌టిస్తోన్న `రెట్రో`లో హీరోయిన్గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే విజ‌య్ 69వ చిత్రంలోనూ పూజాహెగ్డే న‌టిస్తోంది.

Tags:    

Similar News