బ్లాక్ డ్రెస్‌లో పూజా హెగ్డే హై గ్లామర్ ట్రీట్
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో, ట్రెండీ డిజైన్‌లో ఉన్న ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఆమెను హై ఫ్యాషన్ లుక్‌లోకి తీసుకెళ్లింది.
![బ్లాక్ డ్రెస్‌లో పూజా హెగ్డే హై గ్లామర్ ట్రీట్ బ్లాక్ డ్రెస్‌లో పూజా హెగ్డే హై గ్లామర్ ట్రీట్](https://content.tupaki.com/tupaki/feeds/2025/01/29/674570-snapinstapp475694942184921351720488614253421247804332285n1080.webp)
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రతి ఒక్క ఫోటోషూట్‌తో తన స్టైల్ ను మరో లెవెల్ కు తీసుకెళ్తుంది. తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్‌లో పోజులిచ్చిన ఈ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరింత గ్లామర్ కలబోసిన ఈ లుక్ ఆమెకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో, ట్రెండీ డిజైన్‌లో ఉన్న ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఆమెను హై ఫ్యాషన్ లుక్‌లోకి తీసుకెళ్లింది.
![](https://content.tupaki.com/tupaki/feeds/2025/01/29/674569-snapinstapp475694942184921351720488614253421247804332285n1080.jpg)
పూజా హెగ్డే అవుట్‌ఫిట్స్ ఎప్పుడూ క్లాసీగా, స్టైలిష్‌గా ఉంటాయి. ఈ సారి ఆమె ధరించిన బ్లాక్ డ్రెస్, థ్రెడ్ వర్క్ డిజైన్, స్లీవ్‌లెస్ ఫిట్ కట్ విత్ స్లిట్ స్టైల్ కలిపి లుక్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పెర్‌ఫెక్ట్ మేకప్, స్టేట్‌మెంట్ ఇయరింగ్‌లు, కాంపాక్ట్ హెయిర్ స్టైల్ అన్నీ కలిసి ఆమెను రెడ్కార్పెట్ రిచ్ లుక్‌లో చూపించాయి. ఈ ఫోటోలలో కళ్లతోనే ఆకర్షణ కలిగించేలా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే నిజంగా పూజా హెగ్డే తన గ్లామర్ స్టైల్‌లో యునీక్ అని మరోసారి నిరూపించుకుంది.
![](https://content.tupaki.com/tupaki/feeds/2025/01/29/674571-snapinstapp475449011184921351600488618233064395984675753n1080.jpg)
హైహీల్స్, లైటింగ్ ఎఫెక్ట్, బ్యాక్‌డ్రాప్ అన్నీ కలిపి ఈ ఫోటోషూట్‌ను హై స్టాండర్డ్‌కు తీసుకెళ్లాయి. ఈ ఫోటోలు ఆమె లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రమోషన్‌లో భాగమా లేక వేరే స్పెషల్ కంటెంట్‌గా వచ్చాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈమె ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అన్నది ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లను సెట్ చేసేలా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటోకి లక్షలల్లో లైక్స్ రావడం చూస్తుంటే అభిమానులు ఎంతగానో కనెక్ట్ అవుతున్నారని అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ బ్లాక్ డ్రెస్ లుక్ పూజా కెరీర్‌లో మరొక ట్రెండింగ్ ఫ్యాషన్ మూమెంట్‌గా నిలిచిపోవడం ఖాయం.
ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పూజా హెగ్డే, విజయ్ 69లో కూడా మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే హిందీలో కూడా పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక తెలుగులో ఈమధ్య అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ తన అందంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటోంది.