ఐయామ్ వెయిటింగ్ ఫ‌ర్ మై టైమ్!

టాలీవుడ్ లో పూజాహెగ్డే కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-11-09 17:30 GMT

టాలీవుడ్ లో పూజాహెగ్డే కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అవ‌కాశాలు రావ‌డంతో అమ్మ‌డు కెరీర్ నే అక్క‌డే ప్లాన్ చేసుకుని వెళ్లిపోయింది. అక్క‌డే స్థిర‌ప‌డిపోవాల‌ని ముందుకెళ్లింది. కానీ తాను ఒక‌టి త‌లిస్తే దైవం మ‌రొక‌టి త‌లుస్తుంది అన్న‌ట్లు! వెళ్లిన త‌ర్వాత చేసిన సినిమాలేవి క‌లిసి రాలేదు. వ‌రుస ప‌ర‌జ‌యాలు ఇబ్బంది పెట్టాయి. దీంతో అవ‌కాశాలు రాలేదు. అయితే ఈ విష‌యాన్ని అమ్మ‌డు చాలా వేగంగా గ్ర‌హించింది.

అన‌వ‌స‌రంగా అక్క‌డ స‌మ‌యం వృద్ధా చేయ‌కుండా మ‌ళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెట్టి అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిం చింది. ల‌క్కీ గా ఛాన్సులు బాగానే అందుకుంది. తెలుగుతో పాటు త‌మిళ్ లోనూ ఇప్ప‌టికే రెండు మూడు సినిమాలు చేసింది. అవి ఆన్ సెట్స్ లో ఉన్నాయి. తాజాగా అమ్మ‌డు ఎదుర్కున్న గ‌డ్డు ప‌రిస్థితి గురించి తొలిసారి రివీల్ చేసింది. మార్కెట్ గురించి ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు. ఆ ఆలోచ‌న కూడా రానివ్వ‌కుండా ప‌నిచేయ‌డం నాకు అల‌వాటు.

హిట్లు ప్లాపు ల గురించి పెద్ద‌గా ఆలోచించ‌ను. అయితే తీసుకునే నిర్ణ‌యాలు మాత్రం స‌వ్యంగా ఉండాలి. అవే కెరీర్నిఅతి పెద్ద ప్ర‌మాదంలో ప‌డేస్తాయి. ఆ నిర్ణ‌యాలు కొన్నిసార్లు భ‌విష్య‌త్ ని చాలా ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోకి నెట్టుతాయి. ఆ విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆ విష‌యంలో నేను జాగ్ర‌త్త‌గానే ఉన్నాను. ఇప్ప‌టి వ‌ర‌కూ నేను చేసిన పాత్ర‌ల‌న్నింటికి వంద‌శాతం న్యాయం చేసాన‌ని అనుకుంటున్నాను.

ప్ర‌స్తుతం మంచి టైమ్ కోసం ఎదురు చూస్తున్నాను. సెట్స్ లో కొన్ని సినిమాలున్నాయి` అని తెలిపింది. పూజాహెగ్డే కెరీర్ తొలుత కోలీవుడ్ లో ప్రారంభించింది. అటుపై ఒక లైలాకోసం చిత్రంతో టాలీవుడ్ లో లాంచ్ అయింది. అదే స‌మ‌యంలో బాలీవుడ్ మొహంజ‌దారోలోనూ న‌టించింది. కానీ ఇవేవి అమ్మ‌డికి స‌రైన గుర్తింపు తీసుకురాలేదు. `ముకుంద` విజ‌యం త‌ర్వాత టాలీవుడ్ లో కెరీర్ ప‌ట్టాలెక్కింది.

Tags:    

Similar News