బుట్ట బొమ్మకు ఎట్టకేలకు ఒక బిగ్‌ ఛాన్స్‌

తెలుగు లో సినిమా ఆఫర్లు తగ్గిన సమయంలో తెలివిగా తమిళ్‌, హిందీ భాషల్లో ఈ అమ్మడు సినిమాలు చేసేందుకు సిద్ధం అయింది.

Update: 2024-09-13 22:30 GMT

టాలీవుడ్‌ లో గత సంవత్సరం వరకు బిజీ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొంది వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా లో నటించిన భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డ్‌ బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసిన ఆ సినిమా తర్వాత వెంటనే మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం ను పూజా హెగ్డే దక్కించుకున్నా, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ లోనూ ఈమెకు నిరాశే మిగిలిన విషయం తెల్సిందే.

తెలుగు లో సినిమా ఆఫర్లు తగ్గిన సమయంలో తెలివిగా తమిళ్‌, హిందీ భాషల్లో ఈ అమ్మడు సినిమాలు చేసేందుకు సిద్ధం అయింది. లక్కీగా కొన్ని హిందీ సినిమాల్లో ఆఫర్లు వచ్చినా అవి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు, నటిగా మంచి మార్కులు దక్కించుకున్న పూజా హెగ్డే కి గత ఏడాది కాలంగా ఒక్క సినిమాలోనూ ఛాన్స్ రాలేదు. వచ్చిన గుంటూరు కారం కూడా చేజారడంతో పూజా హెగ్డే కెరీర్ ఖతం అంటూ అంతా భావించారు. ఇలాంటి సమయంలో సూపర్‌ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కింది.

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ విజయ్ ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రకటించడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ది గోట్‌ సినిమాతో విజయ్ సినిమాలకు గుడ్‌ బై చెప్పేసి పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలని భావించాడు. కానీ ముందే కమిట్ అయిన సినిమా అవ్వడంతో హెచ్ వినోద్‌ దర్శకత్వంలో విజయ్ నటించాల్సిన పరిస్థితి వచ్చింది. 50 నుంచి 60 రోజుల్లో సినిమా పూర్తి అయ్యే విధంగా దర్శకుడు హెచ్‌ వినోద్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్‌ గా సిమ్రాన్ నటించబోతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్‌ పాత్రకు గాను పూజా హెగ్డే ను ఎంపిక చేశారని తెలుస్తోంది. విజయ్ డ్యుయెల్‌ రోల్‌ అయి ఉండాలి, లేదంటే విజయ్ రెండు ఏజ్‌ గ్రూప్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బుట్ట బొమ్మ కు ఏకంగా సూపర్‌ స్టార్‌ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో మళ్లీ ఈ అమ్మడు పుంజుకోవడం ఖాయం, ముందు ముందు ఈమె నుంచి వరుసగా సినిమాలు రావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగు లో పూజా హెగ్డే తో నటించేందుకు ఏ హీరో మొదట ముందుకు వస్తాడు అనేది చూడాలి.

Tags:    

Similar News