ఈ నటి నేపోకిడ్ కాదు.. డాక్టర్లు లాయర్ల వారసురాలు
సినీపరిశ్రమకు చాలామంది హైప్రొఫైల్స్ అవకాశాల కోసం వస్తుంటారు. అలాంటి హైప్రొఫైల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి పూజా హెగ్డే.
సినీపరిశ్రమకు చాలామంది హైప్రొఫైల్స్ అవకాశాల కోసం వస్తుంటారు. అలాంటి హైప్రొఫైల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి పూజా హెగ్డే. తాను డాక్టర్లు, న్యాయవాదులు ఉన్న కుటుంబం నుంచి సినీరంగంలో అడుగుపెట్టింది. ఇక్కడ అగ్ర కథానాయికగా హోదాను అందుకుంది. ముంబై నుంచి సినీపరిశ్రమకు వచ్చిన కథానాయికల్లో తమన్నా తర్వాత సుదీర్ఘ కెరీర్ ని సాగించిన ప్రతిభావనిగా పూజాకు గుర్తింపు దక్కింది.
తాజా ఇంటర్వ్యూలో పూజా తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పూజా మాట్లాడుతూ.. నేను సినిమా కుటుంబం నుండి రాలేదని తెలిపింది. ``నా తల్లిదండ్రులు న్యాయవాదులు. నా తమ్ముడు ఆర్థోపెడిక్ సర్జన్. ఆ వాతావరణంలో పెరిగిన నేను నటి అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది ఎప్పుడూ నా ప్రణాళిక కాదు. కానీ సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను`` అని తెలిపింది. పరిశ్రమలో ప్రవేశించడాన్ని అదృష్టమని పూజా అంది.
దశాబ్ధపు కెరీర్ లో ఉత్తమ నటులు, దర్శకనిర్మాతలతో కలిసి పని చేసానని పూజా తెలిపారు. తాను నటిగా సాధించాల్సింది చాలా ఉందని కూడా వ్యాఖ్యానించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే ప్రస్తుతం పూజా `దేవా` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్- పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన `దేవా` ఈరోజు థియేటర్లలో విడుదల కాగా మిశ్రమ సమీక్షలు వచ్చాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.... పూజా తదుపరి `రెట్రో` అనే చిత్రంలో సూర్య సరసన కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం `జన నాయగన్`లోను పూజా కథానాయిక. `బీస్ట్` తర్వాత విజయ్ సరసన మరోసారి పూజా జోడీగా నటిస్తున్నారు.