పూజాహెగ్డే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ఈ నేపథ్యంలో తాజాగా పూజాహెగ్డే ఫ్యామిలీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలన్నీ పూజ స్వయంగా రివీల్ చేసింది.
ముంబై బ్యూటీ పూజాహెగ్డే అలియాస్ బుట్టబొమ్మ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ టర్న్ తీసుకున్నా? అక్కడ అవకాశాలు రాకపోవడంతో పెద్దగా సమయం వృధాగా చేయకుండా మళ్లీ సౌత్ లో కి కంబ్యాక్ అవుతుంది. అయితే ఈ బ్యూటీ ముంబై బిజినెస్ మెన్ కుమార్తె అని....బాగా ఆస్తి పరురాలని...సినిమా షూటింగ్ లకు తన సొంత ఖర్చుతో చార్టెడ్ ప్టైట్లో వచ్చేదని ప్రచారం జరిగింది.
ముఖ్యంగా కోలీవుడ్ సినిమా షూటింగ్ లకు అలాగే హజరయ్యేదని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజాహెగ్డే ఫ్యామిలీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలన్నీ పూజ స్వయంగా రివీల్ చేసింది. `నాది సినిమాకు సంబంధించిన కుటుంబం కాదు. తల్లిదండ్రులు న్యాయవాదులు. తమ్ముడు ఆర్ధోపెడిక్ సర్జన్. ఇలాంటి కుటుంబంలో పుట్టిన నేను నటిని అవుతానని ఏనాడు కలలో కూడా అనుకోలేదు.
బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం ఏదో చేస్తాననుకున్నా. కానీ నటిగా సక్సెస్ అవ్వడం అన్నది నాకు ఏమాత్రం ఊహకి అందనిదే. నటి అవ్వాలని నేను వ్యక్తిగతంగా అనుకోలేదు. ఆ ఆలోచన కూడా నాలో ఎప్పుడూ రాలేదు. కానీ అనుకోకుండా రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత చాలా సంతో సంతోషంగా అనిపించింది. పదేళ్ల ప్రయాణంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాను.
ఎంతో మంది అగ్ర హీరోలతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం వచ్చింది. సెలబ్రిటీ లైఫ్ అంటే ఇలా ఉంటుందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నటిగా చాలా దూరం వచ్చేసాను. కానీ నా ప్రయాణం ఇంకా చాలా ఉంది. ఆ దిశగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాను` అని అంది. లావణ్య త్రిపాఠి కూడా న్యాయ వాదుల ఫ్యామిలీ నుంచే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.