టోన్డ్ బాడీతో గుబులు రేపుతున్న పూజా
ఇంతలోనే తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అగ్గి రాజేసే ఫోటోషూట్ ని షేర్ చేసింది.
అందానికి అందం, అద్భుత నటప్రతిభతో మెప్పించిన నటి పూజా హెగ్డే. ఏడెనిమిదేళ్ల పాటు కెరీర్ కోసం పాకులాడిన పూజా అటుపై అనూహ్యంగా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా ఈ భామ నటించింది.
తెలుగులో వరుణ్ తేజ్ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హృతిక్ సరసన మొహంజోదారో చిత్రంలో నటించింది. అటుపూ పూజా జర్నీ ఆసక్తికరం. ఈ బ్యూటీ ఇటీవల సౌత్ తో పాటు బాలీవుడ్ లోను నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాల్లో భారీగా ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. ఇంతలోనే తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అగ్గి రాజేసే ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఈ కొత్త లుక్ లో పూజా టోన్డ్ బాడీ గుబులు రేపుతోంది. ఎంపిక చేసుకున్న టాప్ అంతే అందంగా కుదిరింది. తన బేసిక్ టాప్‌ని అవిషి దయాల్ కల్రా ఫ్యాషన్ లేబుల్ ADK నుండి ఎంపిక చేయగా, కస్టమ్ బ్లాక్ బెలూన్ ప్యాంట్ ని దీనికి జోడించింది. ఈ ఫిగర్-హగ్గింగ్ టాప్ ఓవర్‌సైజ్డ్ ప్యాంట్ అంతే ప్రత్యేకంగా కుదిరింది. ఓవరాల్ గా ఈ లుక్ క్లాస్సీ అనొచ్చు.
పూజా హెగ్డే తన ఆన్ ఫ్లీక్ ఫ్యాషన్ ఎంపికలతో మనల్ని ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాదు. మరొక లుక్‌లో, సుప్రియా ముంజాల్ లేబుల్ నుండి పసుపు రంగు బాడీకాన్ దుస్తులలో కనిపించింది. పసుపు రంగు బాడీకాన్ నెక్‌లైన్ థై స్లిట్ లుక్ తో మతులు చెడగొట్టింది. భారతీయ ట్రెడిషన్ లేదా పాశ్చాత్య రూపంలో కనిపించినా.. పూజా హెగ్డే ఎలాంటి స్టైల్ స్టేట్ మెంట్‌కి అయినా సరిగ్గా సరిపోయే అందం.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళంలో నటిస్తూనే హిందీ చిత్రసీమలో క్రేజీగా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల షాహిద్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ల సరసన అవకాశం దక్కించుకుంది. షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన దేవా లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే కనిపించనుంది. అంతే కాకుండా దళపతి విజయ్ రాజకీయాల్లోకి రాకముందు ప్రకటించిన దళపతి 69, అలాగే సూర్య 44 వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో కూడా కనిపిస్తుంది.