న‌న్ను అంతా తాగుబోతు అని పిలిచేవారు!

దాదాపు ఏడున్నరేళ్ల పాటు తాను మద్యంతో సహజీవనం చేశానని... ఆ తర్వాత మెల్లగా దాన్నుంచి బయటపడ్డానని చెప్పారు.

Update: 2024-04-26 17:30 GMT

బాలీవుడ్ న‌టి..డైరెక్ట‌ర్ కం ప్రొడ్యూస‌ర్ పూజాభ‌ట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈవిడ కూడా కంగ‌న ర‌నౌత్ లాగే ముక్కు సూటి త‌త్వంగల మ‌హిళ‌. విష‌యం ఏదైనా ముఖం మీద‌నే చెప్పేస్తుంది. తాజాగా వ్య‌క్తిగ‌త జీవితానికే సంబంధించిన విష‌యాల్ని రివీల్ చేసింది. ఒకానొక సమయంలో తాను మద్యానికి బానిసనయ్యానని ఈ విషయాన్ని చెప్పడానికి తాను సిగ్గుపడటం లేదన్నారు. దాదాపు ఏడున్నరేళ్ల పాటు తాను మద్యంతో సహజీవనం చేశానని... ఆ తర్వాత మెల్లగా దాన్నుంచి బయటపడ్డానని చెప్పారు.

ఆడవాళ్లం కూడా తాగుతామని... దాన్నుంచి బయట పడతామని...అంత‌టి విల్ ప‌వ‌ర్ మాలోని ఉంద‌ని అన్నారు. ఈ జనరేషన్ లో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నామని.. దీంతో, ఒత్తిడిని తట్టుకోవడానికి మద్యానికి అలవాటు పడుతున్నా మని పేర్కాన్నారు. కానీ కొంత మంది బ‌య‌ట ప‌డ‌లేక జీవితాలు నాశ‌నం చేసుకుంటున్నార‌న్నారు. మద్యం అలవాటు నుంచి బయటపడనివారు మాత్రం వినాశనాన్ని కొనితెచ్చుకున్నట్టేనని వ్యాఖ్యానించారు.

తాను మందుకు బానిస అయిన సమయంలో ఓ టైమ్ లో అందరూ తనను తాగుబోతు అని పిలిచేవారని పూజాభట్ చెప్పారు. మద్యం అలవాటు నుంచి పూర్తిగా బయట పడాలని అనుకున్నానని.. అయితే ఆ వ్యసనం నుంచి బయట పడటం అంత ఈజీగా జరగలేదన్నారు. మద్యం అలవాటును మానేయడానికి నిజంగానే ఓ పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి మహిళలు భయపడతారని.. ఈ సమస్య అందరికీ ఉంటుందన్నారు.

ఇప్పటికైనా మహిళలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గామారాయి. వాటిపై నెటి జ‌నులు ర‌క‌ర‌కాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మ‌ద్యం గురించి మ‌హిళ‌ల్లో ఆమె తీసుకొచ్చిన ఓ అవేర్ నెస్ కార్య‌క్రమంలా ఉందంటూ ఓ యూజ‌ర్ పోస్ట్ చేసాడు.

Tags:    

Similar News