జిమ్‌ లో హాట్‌ బ్యూటీ అందాల ఆరబోత

థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ చిరు నవ్వుతో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేలా చేస్తుంది.

Update: 2023-09-13 03:37 GMT

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ పూజా రామచంద్రన్‌. ఈ అమ్మడు హీరోయిన్‌ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటించడం ద్వారా సౌత్ ఇండియన్ సినీ ప్రేమికులకు సుపరిచితురాలు. ఈ అమ్మడు తెలుగు బిగ్ బాస్‌ లో కూడా సందడి చేసి బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసిన విషయం తెల్సిందే.


ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడి అందాల ఆరబోత కంటిన్యూ అవుతోంది. ఆ మధ్య ఈమె పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. సాధారణంగా సౌత్ హీరోయిన్స్ ఒకప్పుడు పెళ్లి తర్వాత స్కిన్‌ షో కి దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

పెళ్లి తర్వాత కూడా పూజా రామచంద్రన్ ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు వీడియో లు షేర్‌ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు జిమ్‌ లో వర్కౌట్ లు చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ చిరు నవ్వుతో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేలా చేస్తుంది.

హీరోయిన్ గా కాకున్నా సోషల్‌ మీడియా లో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలను చూస్తూ ఉంటే అతి త్వరలోనే మళ్లీ నటిగా ఛాన్స్ లు దక్కించుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెర లేదా వెండి తెరపై మాత్రమే కాకుండా ఓటీటీ ద్వారా కూడా ఈమెను చూడాలని నెటిజన్స్ ఆశ పడుతున్నారు. మరి ఈ అమ్మడు ఓటీటీ లో కనిపించే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.

Tags:    

Similar News