అవగాహన కాదు.. తిరిగి భయపెట్టిన పూనమ్!

ఆమె అసలు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం పక్కన పెడితే.. ఆ వ్యాధి ఉన్న వ్యక్తులు మరింత భయపడేలా చేసిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-02-03 12:30 GMT

సెన్సేషన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ మరోసారి వార్తల్లోకెక్కింది బాలీవుడ్ నటి పూనమ్ పాండే. గతంలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా ప్రతి విషయంలో ఆమె ఎన్నో సార్లు ట్రెండింగ్ లో నిలిచింది. ఇక 2011లో వరల్డ్ కప్ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇలా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ తో ఏదో విషయంలో హాట్ టాపిక్ గా మారడం పూనమ్ కు అలవాటైపోయింది!

రీసెంట్ గా శుక్రవారం (ఫిబ్రవరి 2) పూనమ్ మరణించిందని ఆమె వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో తెలిపారు. ఇక ఆమె మరణ వార్త విని ఒక్కసారిగా అంతా షాకయ్యారు. మొన్నటి వరకు బాగానే ఉన్న ఆమె.. చనిపోవడం ఏంటని అనుమానపడ్డారు. అయితే ఒకరోజు తర్వాత (శనివారం) తాను చనిపోలేదని ఓ వీడియో రిలీజ్ చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. తాను సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందలేదని, ఆ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశానంటూ పూనమ్ ఓ తాజా వీడియోలో చెప్పుకొచ్చింది

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పూనమ్ డెత్ టాపిక్ పై పెద్ద చర్చ మొదలైంది. ఆమె అసలు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం పక్కన పెడితే.. ఆ వ్యాధి ఉన్న వ్యక్తులు మరింత భయపడేలా చేసిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా క్యాన్సర్ పై అవగాహన కల్పించాలనుకుంటే ఇది పద్ధతి కాదని చెబుతున్నారు. ఇలాంటి వరస్ట్ పబ్లిసిటీ స్టంట్ చేయకూడదని ఫుల్ ఫైర్ అవుతున్నారు.

వెంటనే పూనమ్ దేశ ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చనిపోయానంటూ డ్రామాలు ఆడి వైరల్ అవ్వడం అస్సలు కరెక్ట్ కాదని అంటున్నారు. ఆమెపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంత సీరియస్ విషయమైనా ఇలాంటి విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయకూడదని సూచిస్తున్నారు. ఇదొక సిగ్గు చేటు వ్యవహారమని అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పూనమ్ పాండేపై దుమ్మెత్తిపోస్తున్నారు.

అసలు ఆమె చనిపోయిందన్న విషయం.. తన ఇన్ స్టా అకౌంట్ లో చెప్పడమే పెద్ద స్టంట్ లా అనిపించిందని, పబ్లిసిటీ కోసమేనని ముందే గెస్ చేశామని కొందరు నెటిజన్లు అంటున్నారు. కానీ ఇంత చీప్ పబ్లిసిటీ చేస్తుందనుకోలేదని చెబుతున్నారు. కనీసం తన కుటుంబ సభ్యులకు కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో తెలియడం లేదంటున్నారు. దయచేసి క్యాన్సర్ రోగులు భయపడవద్దని ధైర్యం చెబుతున్నారు.


Tags:    

Similar News