బుల్లిరాజుని నలిపేస్తున్నారుగా..!
వెంకటేష్ కొడుకుగా బుల్లి రాజుగా రేవంత్ నటన థియేటర్ లో ఆడియన్స్ ని అలరిస్తుంది. ఆ సినిమాతో బుల్లి రాజుకి అదే రేవంత్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది.
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పరుగులు తీస్తుంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. పొంగల్ కి ఫ్యామిలీ అందరు చూసి ఎంజాయ్ చేసేలా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజుగా నటించిన రేవంత్ చేసిన కామెడీ అదిరిపోయింది.
వెంకటేష్ కొడుకుగా బుల్లి రాజుగా రేవంత్ నటన థియేటర్ లో ఆడియన్స్ ని అలరిస్తుంది. ఆ సినిమాతో బుల్లి రాజుకి అదే రేవంత్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన వాళ్లంతా బుల్లి రాజు పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక రేవంత్ కనిపిస్తే చాలు బుల్లి రాజు అంటూ తన దగ్గరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుల్లి రాజు ని కొందరు ఇబ్బంది కూడా పెడుతున్నారు.
బుల్లి రాజు పాత్రలో తన నటనతో మెప్పించిన రేవంత్ తో మాట్లాడాలి ఫోటో దిగాలని కొందరు అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా అతన్ని లాగుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అతను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడని తెలిసినా లాగి మరీ సెల్ఫీ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన వారంతా అయ్యో బుల్లి రాజుని నలిపేస్తున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల్లో నటించిన వారు బయట కనిపిస్తే వారితో ఫోటో దిగాలి.. మాట్లాడాలని అందరికీ ఉంటుంది. కానీ అవతల వారు ఇబ్బంది పడుతున్నారా లేదా అన్నది ఆలోచించాలి. బుల్లి రాజు కి సంబందించిన వీడియో చూసి రేవంత్ ని అయ్యో పాపం అనేస్తున్నారు. అయినా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అతను అలా జనాల్లోకి వెళ్లడం వల్ల అతనికే ఇబ్బంది అని కూడా చెబుతున్నారు. ఇదే కాదు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు పాత్ర ఫేమస్ అవ్వడం వల్ల రేవంత్ పాత వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపులర్ అవ్వడం వల్ల రేవంత్ కు అనుకోని సమస్యలు తెచ్చి పెడుతున్నాయని చెప్పొచ్చు. ఇదివరకు చైల్డ్ రోల్ లో ఇలా మాస్టర్ భరత్ బాగా క్లిక్ అయ్యాడు. ఇప్పుడు రేవంత్ కూడా అదే రేంజ్ ఛాన్స్ లు అందుకునేలా ఉన్నాడు.