కల్కి మిస్టేక్ రిపీట్ కాకపోవచ్చుగా!
అలాంటి పరిస్థితి కల్కి 2898 AD లో ప్రభాస్- దిశా పటానీకి ఎదురైంది. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ జీరో.;

నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాకపోతే అభిమానులు నిరాశపడటం సహజం. మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ కాకూడదని కోరుకుంటారు. డిడిఎల్‌జే జంట షారూఖ్ - కాజోల్, చిరంజీవి- రాధ, బాలకృష్ణ- విజయశాంతి జంటల్లా అందరికీ కుదరదు. ఒక్కోసారి ఎంపిక చేసుకున్న స్క్రిప్టులో హీరో- హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలకు ప్రాధాన్యత లేకపోవచ్చు.
అలాంటి పరిస్థితి కల్కి 2898 AD లో ప్రభాస్- దిశా పటానీకి ఎదురైంది. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ జీరో. దానికి కారణం ఒకరితో ఒకరు కలహించుకోవడమే. అది వారి పాత్రల స్వభావం. దాని ప్రకారమే దర్శకుడు వారి మధ్య రొమాన్స్ పాళ్లను మెర్జ్ చేయలేపోయారు. దీంతో అభిమానులు కేవలం దిశా పటానీ గ్లామ్ యాంగిల్ ఎలివేషన్ గురించి మాత్రమే చర్చించుకున్నారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర కేవలం యాక్షన్, కామెడీకే పరిమితం. రొమాన్స్ నీరసం పుట్టించింది. అందుకే ఇప్పుడు ఫౌజీ లో తిరిగి ప్రభాస్- దిశా రిపీటవుతున్నారన్న ప్రచారం సాగుతున్నా కానీ అభిమానుల్లో ఉత్సాహం కనిపించలేదు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ జోడీ రిపీట్ కాకూడదని బలంగా కోరుకున్నారు. అయితే ఫౌజీ దర్శకుడు అను రాఘవపూడి రొమాంటిక్ సీన్స్ తీయడంలో ప్రేమకథల్ని అల్లడంలో ఎక్స్ పర్ట్. అతడు కల్కిలో మిస్టేక్ ని రిపీట్ చేసేందుకు అవకాశం లేదు.అయినా దిశా- ప్రభాస్ కాంబినేషన్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. ఈ జోడీ రిపీట్ కావడం లేదని మేకర్స్ ట్రోలింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఓపెనయ్యారు. కనీసం ప్రభాస్ సరసన రెండో హీరోయిన్ గా కూడా కనిపించే ఛాన్స్ లేదని డిక్లేర్ చేసారు.