కన్నప్ప 'ప్రభాస్'.. ఆ హీరో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా?
భారీ బడ్జెట్ తో మోహన్ బాబు.. మూవీని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు.
టాలీవుడ్ ప్రముఖ మంచు ఫ్యామిలీ నుంచి కన్నప్ప సినిమా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. పరమ శివుని భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో మంచు విష్ణు లీడ్ రోల్ లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు.. మూవీని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న కన్నప్ప మూవీకి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన అనేక మంది స్టార్ నటీనటులు, అగ్ర తారలు గెస్ట్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు.
అయితే ఏప్రిల్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా కన్నప్ప రిలీజ్ కానుండగా.. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. నాస్తికుడిగా ఉన్న కన్నప్ప.. భక్తుడిగా ఎలా మారాడన్న పాయింట్ తో సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది.
అదే సమయంలో టీజర్ లో ప్రభాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పించిందనే చెప్పాలి. టీజర్ అంతా ఒకెత్తు అయితే.. ఆయన ఎంట్రీ మరో ఎత్తు. టీజర్ మొత్తానికి ప్రభాస్ ఎంట్రీ సీన్ హైలెట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ వల్ల.. సోషల్ మీడియాలో నార్త్ టు సౌత్ నెటిజన్లు.. ఆ సీన్ ను తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఆయనకు క్రేజ్ ఉన్నా.. ఇప్పుడు టీజర్ వచ్చాక అక్షయ్ రోల్ కు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా శివుడిగా ఆయన లుక్ పై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. మెడలో పాము లేకపోవడమేంటని కొందరు నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు.
మరికొందరు అక్షయ్ అసలు నటించారా.. లేక ఇంకెవరైనా నటిస్తే ఆయన ఫేస్ యాడ్ చేశారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు రెండేళ్ల క్రితం ఓ మై గాడ్ 2 మూవీలో ఇలాంటి రీల్ నే పోషించారు. కానీ దర్శకుడు అమిత్ రాయ్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం శివుని రోల్ ప్రామాణికంగా లేదని అంటున్నారు. అలా టీజర్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ రోల్ కు వచ్చిన హైప్.. అక్షయ్ పాత్రకు రానట్లు కనిపిస్తుంది.