టెన్షన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్.. కారణం తెలిస్తే షాక్!
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రెండు సీక్వెల్ సినిమాల్లో నటించాల్సి ఉంది. మారుతి రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజీ చిత్రాల తర్వాత అతడి దృష్టి ఆ రెండు సీక్వెల్స్‌పైనే ఉంటుందని గుసగుస వినిపిస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రెండు సీక్వెల్ సినిమాల్లో నటించాల్సి ఉంది. మారుతి రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజీ చిత్రాల తర్వాత అతడి దృష్టి ఆ రెండు సీక్వెల్స్‌పైనే ఉంటుందని గుసగుస వినిపిస్తోంది. అయితే కల్కి 2989 ఎడి వచ్చే ఏడాది ప్రారంభించినా కానీ, దానిని పూర్తి చేసి 2028లోనే విడుదల చేస్తారని ఒక గుసగుస వినిపిస్తోంది. అయితే ఇది నిజమా? ప్రభాస్ అభిమానులు అంత కాలం వేచి చూడగలరా? అన్న చర్చా సాగుతోంది.
కల్కి 2989 ఏడి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలవగా, దీనికి సీక్వెల్ ని వేడి మీద ఉన్నప్పుడే రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ట్రేడ్ నిపుణులు కానీ కోరుకుంటారు. అందుకు భిన్నంగా కల్కి 2989 ఏడి సీక్వెల్ ని మూడేళ్ల తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు గాసిప్పులు షికార్ చేస్తున్నాయి. అయితే ఇది కేవలం గాసిప్ మాత్రమే. నిజానికి కల్కి లాంటి సినిమాని ఏడాదిన్నరలో పూర్తి చేసి రిలీజ్ చేయగలిగితే నాగ్ అశ్విన్ - అశ్వనిదత్ బృందానికి కలిసి వస్తుంది. దూరం ఎక్కువైనా కానీ క్రేజ్ సడలేందుకు అవకాశం ఉంటుంది.
అలాగే ఈ సీక్వెల్ కథ కూడా మారిందని, ఇప్పుడు టైటిల్ కూడా మారుతోందని గుసగుస వినిపిస్తోంది. కల్కి 2989 ఏడి నుంచి `కర్ణ 3102 బిసి`గా టైటిల్ మారుతుందనేది మరో గుసగుస. అంటే కర్ణుడు - అశ్వత్థామ చుట్టూ తిరిగే కథను నాగ్ అశ్విన్ తెరపై చూపిస్తాడని, మధ్యలో విలన్ యాస్కిన్ ప్రవేశిస్తాడని చెబుతున్నారు. యాస్కిన్‌గా కమల్ హాసన్ పాత్రను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారని కూడా తెలుస్తోంది. బీసీ లో చెప్పే కథ అంటే మహాభారత యుద్ధం తర్వాత ఏం జరిగిందనే కథను తెరపై చూపిస్తారట. అయితే వీటన్నిటికీ అధికారికంగా నిర్ధారణ రావాల్సి ఉంది. ఓవైపు తెలుగు మీడియాలో ఇలాంటి ప్రచారం సాగుతుంటే, కల్కి సీక్వెల్ కథను కొన్ని యూట్యూబ్ చానెళ్లు లీక్ చేసేయడం వింతగా అనిపిస్తోంది. కల్కి 2989 ఏడితో పాటు ప్రభాస్ సలార్ సీక్వెల్ సినిమాలోను నటించాల్సి ఉంది. సలార్ బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించింది. పార్ట్ 2 ని గ్రాండ్ గా తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ కాల్షీట్లను సర్ధుబాటు చేయాల్సి ఉంటుంది.