ప్రభాస్ బర్త్ డే.. ఇది ఎవరూ ఊహించలేదుగా!

ప్ర‌భాస్ ఇప్పటికే న‌టించిన ఐదుకు పైగా సినిమాలు ఒకే రోజు రీరిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2024-10-16 17:52 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరకీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు పాన్ ఇండియాలో వేరే లెవల్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. వారంతా ప్రభాస్ నటించిన సినిమాలు ఎప్పుడు వస్తాయోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన యాక్ట్ చేస్తున్న మూవీల అప్డేట్స్ వచ్చినా సంబరపడిపోతుంటారు. అదే సమయంలో డార్లింగ్ పుట్టినరోజును పెద్ద పండుగలా జరుపుకుంటారు.

అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ బర్త్ డే కనుక.. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం ఇప్పటికే ప్లాన్స్ వేసుకుంటున్నారు. రచ్చ రచ్చ చేయాలని చూస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. హీరోల బర్త్ డేలతో పాటు స్పెషల్ అకేషన్స్ కు ఇప్పటికే రిలీజైన మూవీలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. ఆయన బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ ట్రెండ్ మరోస్థాయికి చేరనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ప్ర‌భాస్ ఇప్పటికే న‌టించిన ఐదుకు పైగా సినిమాలు ఒకే రోజు రీరిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్, ఛత్రపతి, చక్రం, మిస్టర్ పర్ఫెక్ట్, బిల్లా అక్టోబర్ 23న రీరిలీజ్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరిన్ని సినిమాలను కూడా మళ్లీ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే కనుక జరిగితే నెవ్వర్ బిఫోర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. షాకింగ్ గా ఉందని.. అస్సలు ఊహించలేదని చెబుతున్నారు. ఒకటి లేదా రెండు సినిమాలు ఓకే గానీ ఐదు కన్నా ఎక్కువ చిత్రాలు.. అది కూడా ఒకేరోజు రీరిలీజ్ అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. ఫ్యాన్స్ సంబరాలు.. సందడి వేరే లెవెల్ లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల నుంచి కూడా ఆయన బర్త్ డే సందర్భంగా అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రాజా సాబ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మేకర్స్ ప్రభాస్ లుక్స్ ను రిలీజ్ చేయగా.. పుట్టినరోజు నాడు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఆయన లైనప్ లో ఉన్న మరిన్ని ప్రాజెక్టుల మేకర్స్ కూడా అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అవేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News