ప్రభాస్ పై పెట్టుబడి.. లెక్క 2000 కోట్లకు పైనే..

ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు.

Update: 2024-09-13 09:30 GMT

ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. అతని సినిమాల మార్కెట్ మాత్రమే కాకుండా బడ్జెట్ లు కూడా షాక్ ఇచ్చే రేంజ్ లో ఉంటున్నాయి. ప్రభాస్ తో సినిమా చేయాలంటే మినిమమ్ 300 కోట్లకి బడ్జెట్ ని నిర్మాతలు రెడీ చేసుకోవాల్సిందే. అయిన కూడా మరో మూడేళ్ళ వరకు ప్రభాస్ కాల్ షీట్స్ దొరకడం చాలా కష్టం. అంత పెద్దగా ప్రభాస్ లైన్ అప్ ఉంది. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ సినిమా సినిమాకి పెరిగిపోతుంది.

బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో వరుసగా మూడు డిజాస్టర్స్ ప్రభాస్ అందుకున్నారు. అయినా కూడా సలార్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో ఆయన క్రేజ్ ఏంటో అర్ధమయ్యింది. ఈ ఏడాది రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ సినిమా అయితే 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. సరైన కంటెంట్ తో మూవీస్ చేస్తే ప్రభాస్ 1000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా అందుకుంటాడని కల్కి ప్రూవ్ చేసింది.

దీంతో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాల పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ లతోనే తెరకెక్కుతూ ఉండటం విశేషం. నెక్స్ట్ డార్లింగ్ నుంచి రాబోయే ది రాజాసాబ్ సినిమాని 400+ కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్ లో ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాని ప్రభాస్ స్టార్ట్ చేశాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 320+ కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోందంట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ మూవీకి 350+ కోట్ల బడ్జెట్ అవుతుందంట. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ ఏడాదిలోనే స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పూర్తి చేయాల్సి ఉన్న సలార్ పార్ట్ 2కి 350 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి పార్ట్ 2 కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ 650+కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఈ 5 సినిమాల బడ్జెట్ లు కలిపితే 2000 కోట్లకి పైగానే లెక్కలు తేలుతున్నాయి. రాబోయే 3 ఏళ్ళలో 2000 కోట్ల రూపాయిలు ప్రభాస్ మీద నిర్మాతలు ఖర్చు చేస్తున్నారంటే ఆయన స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాల ద్వారా కనీసం 4000-5000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.

Tags:    

Similar News