కోల్ కత్తాని టార్గెట్ చేసిన పౌజీ..హను పెద్ద ప్లానింగే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రం `పౌజీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రం `పౌజీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ వార్ యాక్షన్ తో పాటు అద్భుతమైన లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ముందు జరిగే స్టోరీ కావడంతో? లొకేషన్ల విషయంలో రాఘవపూడి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. అప్పటి బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన సెట్లు నిర్మించి షూటింగ్ చేస్తున్నాడు. అందుకు రామోజీ పిలిం సిటీ వేదిక అయింది.
ఇప్పటికే అక్కడ ఓ భారీ జైలు సెట్ నిర్మించి అందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో ఆ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా తదుపరి షెడ్యూల్ కి రంగం సిద్దమవుతోంది. దీనిలో భాగంగా రియల్ లొకేషన్లో నే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు హను రెడీ అవుతున్నాడు. ఐకానిక్ సిటీ కోల్ కత్తాలో తదుపరి షెడ్యూల్ ఉంటుందిట. దీనిలో భాగంగా హను అండ్ కో లొకేషన్ల వేట కోసం కోల్ కత్తా వెళ్లినట్లు సమాచారం. హను రాసుకున్న కథకి...కోల్ కత్తాకి కొంత సంబంధం ఉండటంతో ఓ షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేసినట్లు వినిపిస్తుంది.
పశ్చిమ బెంగాల్ గొప్పతనం...అక్కడ నగర నిర్మాణం...సంస్కృతి..సంప్రదాయాల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయట. దీనిలో భాగంగా టీమ్ లొకేషన్ల వేటలో పడినట్లు సమాచారం. ఇప్పటికే హను టీమ్ అక్కడకి చేరుకుని జల్లెడ పడుతున్నట్లు తెలిసింది. లొకేషన్లు ఫైనల్ కాగానే? అందుకు సంబంధించిన అనుమతులు తీసుకుని షూట్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ షూట్ వేసవి నుంచి ఉంటుందని తెలిసింది. దాదాపు నెల రోజుల పాటు పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే షూటింగ్ ఉంటుందిట. అంటే ఇది చాలా పెద్ద షెడ్యూల్ అని తెలుస్తుంది. రియల్ లొకేషన్లలో షూటింగ్ చేయాల నే హను ఇలా ముందుకెళ్తున్నాడు. హను రాఘవపూడి కెరీర్ లో ఇదే తొలి భారీ బడ్జెట్ చిత్రం. సినిమాపై అంచనా లు కూడా భారీగా ఉన్నాయి. హను తొలి పాన్ ఇండియా చిత్రం `సీతారామం` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. `పౌజీ` చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.