ఆరు ఆర్మీ కథలు.. ఫౌజి అసలు గుట్టు విప్పిన హను
ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'ఫౌజీ' అనే టైటిల్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా మూవీ టైటిల్ ని ఇంకా ఖరారు చేయలేదు.
'సీతారామం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హను రాఘవపూడి డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉంటుందని సమాచారం. 1945 బ్యాక్ డ్రాప్ లో ఈ కథని దర్శకుడు హను రాఘవపూడి సిద్ధం చేశారు. ఈ సినిమాతో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
వార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. దర్శకుడు హను రాఘవపూడి గతంలో నేచురల్ స్టార్ నాని కోసం సిద్ధం చేసిన కథతోనే ప్రభాస్ తో మూవీ చేస్తున్నారని టాక్ నడిచింది. తాజాగా దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. నాని కోసం రాసిన కథ, ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న మూవీ ఒకటి కాదని తేల్చేశారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తాను ఆరు కథల వరకు రాసుకున్నానని అన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సినిమా కథ 'సీతారామం' మూవీ తర్వాత రాసుకున్నదని చెప్పారు. కేవలం ప్రభాస్ కోసమే ఈ కథని రాసుకున్నానని అన్నారు. కంప్లీట్ స్టోరీ సిద్ధం చేయడం కోసం ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు. కచ్చితంగా ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ ఆకట్టుకుంటుందని, ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఎలిమెంట్స్ ఉంటాయని అన్నారు. అలాగే ఆడియన్స్ సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంతో ఆస్వాదిస్తారని హను రాఘవపూడి అన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి 'ఫౌజీ' అనే టైటిల్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా మూవీ టైటిల్ ని ఇంకా ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పనిచేసే సైనికుడిగా ఉంటాడని తెలుస్తోంది. ఇమాన్వి ఇస్మాయిల్ కి ఇదే మొదటి సినిమా. ఆమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొత్త ఫేస్ కోసం ట్రై చేసిన హను రాఘవపూడి ఇమాన్విని ఆడిషన్స్ చేసి ఎంపిక చేశారు.
ఇప్పటికే ఆమె మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. త్వరలో ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే హను మాత్రం సినిమా షూటింగ్ చేస్తోన్న ఎలాంటి అప్డేట్స్ బయటకి రాకుండా చూసుకుంటున్నారు. రాజా సాబ్ అనంతరం ఈ సినిమా అసలు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.