దేవగన్ కొడుకు, రవీనా కూతురు.. ప్రభాస్ కు నచ్చి నట్టుందే

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కొడుకు ఆమన్.. ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా.. హీరోహీరోయిన్లుగా అజాద్ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-16 11:03 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కొడుకు ఆమన్.. ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా.. హీరోహీరోయిన్లుగా అజాద్ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. 2025 జనవరి 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


అజయ్ దేవగన్ కూడా అజాద్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి డయానా పెంటీ మరో మెయిన్ రోల్ లో నటిస్తున్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు రోనీ స్క్రూవాలా, ప్రగ్యా కపూర్.. గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అభిషేక్ నయ్యర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే సినిమా టీజర్ రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. స్వాతంత్ర్యానికి ముందు స్వేచ్ఛ కోసం సాగిన పోరాటం నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. దేశభక్తి కథకు లవ్ స్టోరీ, గుర్రం స్టోరీ యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 12వ తేదీన జైపూర్‌ లో బిరంగీ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిరంగే సాంగ్ ఫుల్ వైరల్ గా మారింది. హోలీ స్పెషల్ గా సాంగ్.. సినిమాలో రాబోతున్నట్లు తెలుస్తోంది. వీడియో సాంగ్ గ్లింప్స్ అంతా కలర్ ఫుల్ గా ఉంది

ఆమన్, రషా.. తమ లుక్స్ తో ఆకట్టుకున్నారు. క్రేజీ స్టెప్పులతో అదరగొట్టారు. ఊపు వచ్చే మ్యూజిక్ తో తమ డ్యాన్స్ తో సందడి చేశారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన బిరంగే సాంగ్.. ఎందరో మ్యూజిక్ లవర్స్ కు ఫేవరెట్ గా మారింది. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఆ సాంగ్ కోసం ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

బిరంగే సాంగ్ నచ్చిందని తెలిపారు. రషా అండ్ ఆజాద్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. బిరంగే పాట లింక్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ పోస్ట్ వైరల్ గా మారగా.. ఆయన ఫ్యాన్స్ కూడా పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు అభిమానులూ సాంగ్ బాగుందని చెబుతున్నారు. మొత్తానికి తనకు నచ్చిన కంటెంట్ ను ప్రభాస్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారన్న విషయం తెలిసిందే.

Full View
Tags:    

Similar News