కన్నప్పకు ప్రభాస్ షాకింగ్ రెమ్యూనరేషన్!
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నప్పలో ప్రభాస్ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడన్న వార్త బయటకు రాగానే కన్నప్పపై ఉన్నట్టుండి ఒక్కసారిగా హైప్ భారీగా పెరిగింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. దీంతో కన్నప్పలో కీలక పాత్ర చేస్తున్న ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అని తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
మామూలుగా అయితే ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు బడ్జెట్ ను బట్టి ఛార్జ్ చేస్తుంటాడు. అది కాకుండా కొన్ని సార్లు లాభాల్లో వాటా కూడా ఇస్తుంటారు నిర్మాతలు. అంతటి డిమాండ్ ఉన్న ప్రభాస్ కన్నప్ప సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాను చేశాడట.
కేవలం తమ ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతోనే ప్రభాస్ ఈ సినిమాను చేశాడనే విషయాన్ని స్వయంగా మంచు విష్ణు వెల్లడించాడు. ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కలిసొచ్చే ఛాన్సుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటూ మోహన్ లాల్ కూడా నటించగా, ఆయన కూడా కన్నప్ప సినిమాను ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీ గానే చేశాడని విష్ణు తెలిపాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ తో పాటూ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమానే కాకుండా కల్కి2, సలార్2 సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది.