ప్రభాస్.. మరో పదేళ్లు తిరుగు లేనట్లే!
ప్రభాస్.. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి. నార్త్ టు సౌత్ తన టాలెంట్ తో ఓ రేంజ్ లో సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.
ప్రభాస్.. ఇది పేరు కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి. నార్త్ టు సౌత్ తన టాలెంట్ తో ఓ రేంజ్ లో సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. మాస్, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, పౌరాణికం.. అలా ఏ జోనర్ అయినా ప్రభాస్ నే ఎంచుకుంటున్నారు దర్శకులు. కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అన్న విధంగా ఉండే ప్రభాస్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు 22 ఏళ్ల కెరీర్ లో అనేక హిట్స్ అందుకుని దూసుకుపోతున్నారు ప్రభాస్.
తొలి సినిమా ఈశ్వర్ నుంచి రీసెంట్ గా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ వరకు ప్రభాస్ తన ప్రతిభను చాటుతూనే ఉన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన రాజా సాబ్ తో సందడి చేయనున్నారు.
ఇప్పుడు ప్రభాస్ లైనప్ లో రాజా సాబ్ కాకుండా సలార్-2, కల్కి-2, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్క్ తో ఆయన వర్క్ చేయనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అనౌన్స్మెంట్స్ కూడా రానున్నాయని టాక్ వస్తోంది. అదే సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ భారీ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రభాస్ తో ఏకంగా వరుసగా మూడు సినిమాలు ప్లాన్ చేసింది హోంబలే ఫిల్మ్స్ సంస్థ. ఆ మూడు సినిమాలను 2026, 2027, 2028లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సలార్ సీక్వెల్ రిలీజ్ తో జర్నీ ప్రారంభం అవుతుందని తెలిపింది. అయితే లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన సినిమాలను హోంబలే ఫిల్మ్స్ రూపొందించనుందని అప్పటి నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ప్రభాస్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల బడ్జెట్ మొత్తం కలిపి దాదాపు రూ.3000 కోట్లకు పైగా ఉంటుందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రాలన్నీ రూ.5 వేల కోట్లకు పైగా వసూలు చేయనున్నాయని అంచనా వేస్తున్నారు. అలా మరో పదేళ్లకు పైగా ప్రభాస్ కెరీర్ కు తిరుగులేదని.. ఆయన డామినేషన్ సాగుతూనే ఉంటుందని చెబుతున్నారు. మరి ప్రభాస్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో? ఎప్పుడు రిలీజ్ అవుతాయో? ఎంతటి వసూళ్లు సాధిస్తాయో? వేచి చూడాలి.