మోహన్ బాబు తో ప్రభాస్ ఫన్నీ వీడియో
డార్లింగ్ ఎక్కడైనా పార్టీ ఇస్తున్నాడంటే అందులో ఫుడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తను తినడమే కాకుండా తన ఫ్రెండ్స్, తోటి నటీనటులకు, వీలున్నప్పుడు ఫ్యాన్స్ కు కూడా భోజనాన్ని పెడుతూ ఉంటాడు ప్రభాస్. డార్లింగ్ ఎక్కడైనా పార్టీ ఇస్తున్నాడంటే అందులో ఫుడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఎన్నో రకాల వెరైటీలతో గెస్టుల కడుపు నింపేస్తాడు ప్రభాస్.
ఇదిలా ఉంటే ప్రభాస్, ప్రస్తుతం కన్నప్పలో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి పెద్ద నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా లెవెల్ లో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడటంతో మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు. అందులో భాగంగానే రీసెంట్ గా ముంబైలో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగ్గా అక్షయ్ కుమార్ ఆ ఈవెంట్ కు హాజరయ్యారు. మార్చి 1న ఈ టీజర్ అఫీషియల్ గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రభాస్, మోహన్ బాబు మధ్య జరిగిన ఓ ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్, మోహన్ బాబు తమ ముక్కు గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ఆ సంభాషణలో ప్రభాస్ మీ ముక్కు షార్ప్ గా ఉంది, కానీ నాది అంతకంటే షార్ప్ గా ఉంది అని ప్రభాస్ అన్నాడు. అంతేకాదు, తాను చిన్నప్పుడు ముక్కుతో టమోటాలు కట్ చేసే వాడినని అనగానే ఏంటి టమోటాలు కూడా కట్ చేశారా అని మోహన్ బాబు అడగ్గానే ప్రభాస్ తెగ నవ్వుతూ పక్కకెళ్లిపోయాడు. ఈ వీడియో మొత్తాన్ని మంచు విష్ణు తన కెమెరాలో షూట్ చేసినట్టు అర్థమవుతుంది.
బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు కలిసి నటించగా, ఆ సినిమాలో హీరోయిన్ కు అన్నయ్య గా మోహన్ బాబు నటించడంతో ప్రభాస్ కు ఆయన్ని బావ అని పిలవడం అలవాటైపోయింది. ఆ అలవాటే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది.