పాన్ ఇండియా స్టార్ తో ప్రశాంత్ వర్మ సిల్లీ కాదుగా!
కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటనతో సర్ ప్రైజ్ లు ఇవ్వడం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి అలవాటు. 'పౌజీ' అనే ప్రాజెక్ట్ ఉందని అసలు ప్రచారమే జరగలేదు.;
కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటనతో సర్ ప్రైజ్ లు ఇవ్వడం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి అలవాటు. 'పౌజీ' అనే ప్రాజెక్ట్ ఉందని అసలు ప్రచారమే జరగలేదు. అప్పటివరకూ హను రాఘవపూడి పేరు కూడా తెరపైకి రాలేదు. కట్ చేస్తే ఎలాంటి హంగామా లేకుండా పౌజీ ప్రారంభమవ్వడం...పట్టాలెక్కించడం అంతా వేగంగా జరిగిపోయింది. ఇలా జరుగుతుందని హను రాఘవపూడి కూడా గెస్ చేసి ఉండడు.
ప్రభాస్ తో సినిమా చేయాలంటే ఓ ఐదేళ్లు అయినా వెయిట్ చేయాలని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ప్రభాస్ లైనప్లో సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఇలా ఇన్ని పెద్ద ప్రాజెక్ట్ లున్నాయి కాబట్టి ఐదేళ్ల వరకూ ఆయన వైపు చూసే అవకాశమే ఉండక పోవచ్చు అని భావించి ఉండొచ్చు. కానీ పౌజీ కి డేట్లు ఇచ్చి రాజాసాబ్ ని కూడా పక్కనబెట్టి పనిచేయడం అన్నది ప్రభాస్ కే చెల్లింది. మరి ఇదే కోవలో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కుతుందా? అన్నది చూడాలి.
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ యూనివర్శ్ లో భాగంగా ఈ సినిమా మొదలవుతుందని వార్తలొస్తున్నాయి. 'హనుమాన్' పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ప్రశాంత వర్మ తనకంటూ ఓ యూనివర్శ్ ని క్రియేట్ చేసుకుని సినిమాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కన్నడ నటుడు రిషభ్ శెట్టితో 'జైహనుమాన్' ప్రకటించాడు.
ఆ సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో 'జై హనుమాన్' తర్వాత కథనే ప్రశాంత్ వర్మ ప్రభాస్ తో తీస్తున్నాడు? అన్న ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ప్రశాంత్ వర్మ నిజమైతే? ప్రభాస్ రెండింతలు వాస్తవంగా కనిపిస్తాడు. అందుకు అతడి గత ట్రాక్ రికార్డే చెబుతుంది. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లు ప్రకటిస్తున్నాడు తప్ప అవి పట్టాలెక్కడం లేదు. డార్లింగ్ తో మాత్రం అలాంటి సిల్లీ వార్త కాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.