రాజా సాబ్‌పై అవ‌న్నీ పుకార్లేన‌న్న టీమ్

క‌ల్కి 2989 ఏడి రూపంలో భారీ బ్లాక్‌బస్టర్‌ని సాధించాడు ప్ర‌భాస్. ఈ సినిమా 1000 కోట్లుపైగా వ‌సూలు చేసింది.

Update: 2024-09-21 09:34 GMT

క‌ల్కి 2989 ఏడి రూపంలో భారీ బ్లాక్‌బస్టర్‌ని సాధించాడు ప్ర‌భాస్. ఈ సినిమా 1000 కోట్లుపైగా వ‌సూలు చేసింది. ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్ చిత్రం ఇది. పాన్ ఇండియన్ స్టార్ ప్ర‌భాస్ తదుపరి రొమాంటిక్ హారర్ కామెడీ `రాజా సాబ్‌`లో కనిపించనున్నారు. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి చాలా పుకార్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

రాజా సాబ్ ఆడియో హక్కులు తక్కువ ధరకు అమ్ముడయ్యాయని ఇంత‌కుముందు ఒక గాసిప్ వైర‌ల్ అయింది. అయితే ఈ నిరాధార ఊహాగానాలను టీమ్ తోసిపుచ్చింది. ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియాలో మరో గాసిప్ వైర‌ల్ అవుతోంది. అయితే ఈ పుకారు కూడా నిజం కాదు. టీమ్ ఇప్ప‌ట్లో టీజర్‌ను ఆవిష్కరించే ఆలోచనలో లేదు. ఈ చిత్రం ఏప్రిల్ 2025లో పెద్ద స్క్రీన్‌లలోకి విడుద‌ల‌వుతుంది. విడుదల సమయానికి దగ్గరగా మాత్ర‌మే ప్ర‌చార కంటెంట్ ని విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం.

సినిమాను దిగజార్చేందుకు రూమర్‌లు క్రియేట్ చేస్తున్నార‌ని, తప్పుడు వార్తలను నమ్మవద్దని అభిమానులను మేక‌ర్స్ అభ్యర్థించారు. ఎలాంటి ప్రకటన అయినా ప్రొడక్షన్ హౌస్ నుండి నేరుగా వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజా సాబ్‌ను నిర్మిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగ‌ర్వాల్ క‌థానాయికలుగా న‌టిస్తున్నారు.

Tags:    

Similar News