రెబల్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్..!

ఐతే ఇన్నాళ్లు ఫౌజీని ప్రభాస్ లేకుండా షూటింగ్ నిర్వహించిన డైరెక్టర్ ప్రభాస్ ఇంకా హీరోయిన్ తో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Update: 2025-01-20 07:40 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో ఒకటి మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ కాగా మరొకటి హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజి ఒకటి. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్స్ తో వస్తున్నాయి. రాజా సాబ్ షూటింగ్ 80 శాతం పైగా పూర్తి కాగా ఫౌజీ సినిమా మాత్రం ఈమధ్యనే మొదలు పెట్టారు. ఐతే ఇన్నాళ్లు ఫౌజీని ప్రభాస్ లేకుండా షూటింగ్ నిర్వహించిన డైరెక్టర్ ప్రభాస్ ఇంకా హీరోయిన్ తో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ మధురై లోని కారైకుడిలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు. దేవిపురం అనే అగ్రహారం బ్యాక్ డ్రాప్ లో ఈ షెడ్యూల్ జరగబోతుందని తెలుస్తుంది. దాదాపు 20 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

సీతారామం హిట్ తో హను తన డైరెక్షన్ టాలెంట్ చూపించగా ప్రభాస్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుతున్నారో దానికి మించి ఉండేలా చూపించబోతున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ హను కాంబోలో వస్తున్న ఫౌజీ కచ్చితంగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఆ సినిమాకు తన డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

దీనితో పాటుగా సందీప్ వంగతో చేయాల్సిన స్పిరిట్ సినిమాకు కూడా ప్రభాస్ డేశ్ అడ్జెస్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ నుంచి ఈ ఇయర్ రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాజా సాబ్ అసలైతే ఏప్రిల్ 10న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమని తెలుస్తుంది. ప్రభాస్ ఫౌజీ ని కూడా ఈ ఇయర్ ఎండింగ్ లేదా 2026 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమాల లిస్ట్ చూసి రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. తప్పకుండా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టిస్తాడని ఫిక్స్ అయ్యారు.

Tags:    

Similar News