సల్మాన్ (Vs) ప్రభాస్: పోలిక చూస్తున్న ఫ్యాన్స్
ఖాన్‌ల త్రయం నాలుగు దశాబ్ధాలుగా సినీపరిశ్రమలో పాతుకుపోయి ఉన్నారు. అందులో సల్మాన్ ఖాన్ అజేయమైన కెరీర్ జర్నీ గురించి తెలిసిందే.
ఖాన్‌ల త్రయం నాలుగు దశాబ్ధాలుగా సినీపరిశ్రమలో పాతుకుపోయి ఉన్నారు. అందులో సల్మాన్ ఖాన్ అజేయమైన కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన మేటి కథానాయకుడు. అలాంటిది ఇప్పుడు సల్మాన్‌ని మించిన స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నాడంటూ కేవలం 2 దశాబ్ధాల కెరీర్ మాత్రమే ఉన్న ప్రభాస్ ని పొగిడేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే బాహుబలి స్టార్ గా పాన్ ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ప్రభాస్, వరుసగా సెన్సేషనల్ హిట్స్ తో ఇతర స్టార్లను రేసులో వెనక్కి నెట్టాడన్నది వాస్తవం.
అందుకే ఇప్పుడు ఖాన్‌లతో ప్రభాస్ పోలిక చూడటం సహజంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో ప్రభాస్ పోలిక చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సల్మాన్ నటించిన సికిందర్ ఈద్ 2025 విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు రెండో టీజర్ ని విడుదల చేయగా సల్మాన్ యాక్షన్ ప్యాక్డ్ అవతార్ ని చూసిన నెటిజనం రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ సలార్ -1లో గొడ్డలి ఫైట్‌తో `సికందర్` గొడ్డలి ఫైట్‌ని పోల్చి చూస్తున్నారు. సల్మాన్ ని మళ్లీ అదే పాత మూసలో మురుగదాస్ చూపిస్తున్నాడంటూ కొందరు తీవ్రంగా విమర్శించారు. అయితే సల్మాన్ అభిమానులు మాత్రం సికందర్ ప్రభంజనం మొదలైందని కొనియాడుతున్నారు. `సలార్`తో పోలిక వరకూ పరిశీలిస్తే.. నెటిజనుల వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
`సలార్ : పార్ట్ 1 సీజ్‌ఫైర్`తో పోలికలు చూపిస్తూ.. గొడ్డలి పోరాట సన్నివేశంలో సారూప్యతలను ఎత్తి చూపారు. మరికొందరు టీజర్ నిరాశపరిచిందని అన్నారు. మరో ఫార్ములా మసాలా చిత్రంలా ఉంది. సల్మాన్ ఖాన్ ని అంత బాగా చూపించలేదు అని వ్యాఖ్యానించారు. మరోసారి అదే మసాలా సినిమాలా కనిపిస్తోంది.. ఒక గొడ్డలి పోరాట సన్నివేశంతో...! అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. ఎప్పటిలాగే చాలా పాత స్టైల్లో ఉంది. బలహీనమైన టీజర్ నా అభిప్రాయం, ఉత్సాహం లేదు..! అని ఒకరు వ్యాఖ్యానించారు.
నెటిజనుల వ్యాఖ్యలను బట్టి.. సల్మాన్ యాక్షన్ ఎపిసోడ్ ని ప్రభాస్ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ తో పోల్చడం అన్నది మారుతున్న ట్రెండ్‌ని సూచిస్తోంది. ఒకప్పుడు ఫలానా బాలీవుడ్ స్టార్‌లా తెలుగు హీరో నటించాడు! అని పోల్చి చూసేవారు. రాజ్ కపూర్‌లా ఏఎన్నార్ నటించాడు! అని అనేవారు. కానీ ఇప్పుడు ప్రభాస్ లా సల్మాన్ యాక్షన్ ఎపిసోడ్ లో కనిపించాడు! అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది కచ్ఛితంగా నోట్ డౌన్ చేయాల్సిన పాయింట్. అయితే సల్మాన్ బాలీవుడ్‌లో అతి పెద్ద యాక్షన్ స్టార్. కొన్ని సన్నివేశాలను మాత్రమే పోల్చి చూడాలి. ఏ ఇద్దరు స్టార్లు ఒకటి కాదు. ఎవరి ఇమేజ్.. బలాబలాలు వారికి ఉంటాయి.
ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన `సికందర్` యాక్షన్ ప్యాక్డ్ సినిమా. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న కూడా కీలక పాత్రల్లో నటించారు. అభిమానులు సికందర్ ని గ్రాండ్
ఈద్ 2025 విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.