ఒకేసారి ముగ్గురితో ప్రభాస్ లవ్ గేమ్స్..

ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ నడుమ వచ్చే సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మారుతి ప్లాన్ చేసుకున్నాడు.

Update: 2024-09-09 04:08 GMT

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హర్రర్ కామెడీ జోనర్ లో ది రాజాసాబ్ మూవీ సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు మారుతి అస్సలు బ్రేక్ తీసుకోకుండా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారంట.

ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ నడుమ వచ్చే సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని మారుతి ప్లాన్ చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ షెడ్యూల్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వినాయకచవితి, ఆదివారం కూడా రెస్ట్ తీసుకోకుండా షూట్ చేసారంట. ప్రస్తుతం కీలకమైన ఫన్నీ సీక్వెన్స్ ని మారుతి తెరకెక్కిస్తున్నారంట ఈ సీక్వెన్స్ లలో హీరో, హీరోయిన్స్ తో పాటు మరికొంత మంది నటీనటులు కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.

కల్కి 2898ఏడీ తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ది రాజాసాబ్. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే మూవీ షూటింగ్ సగం వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మిగిలిన టాకీ పార్ట్, సాంగ్స్ అన్ని కూడా బ్యాక్ టూ బ్యాక్ షూట్ చేయనున్నారంట. ప్రభాస్ కూడా మారుతి దర్శకత్వంలో సినిమాని కంప్లీట్ చేసుకొని హను రాఘవపూడితో చేయనున్న ఫౌజీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నట్లు సమాచారం.

దాంతో పాటుగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబోతోంది. అలాగే కల్కి2898ఏడీ పార్ట్ 2 కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మారుతితో చేస్తోన్న ది రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక మిగిలిన సినిమాలకి డార్లింగ్ ప్రభాస్ క్లియరెన్స్ ఇవ్వనున్నారంట. ది రాజాసాబ్ మూవీ నుంచి వచ్చిన టీజర్ తో సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.

అలాగే ది రాజాసాబ్ సినిమాలో మంచి డాన్స్ నెంబర్స్ ఉంటాయని థమన్ ఓ సినిమా ఈవెంట్ లో చెప్పారు. దీంతో చాలా కాలం తర్వాత ప్రభాస్ డాన్స్ ని మరల చూసే అవకాశం వస్తుందనే ఉత్సాహంతో ఫ్యాన్స్ ఉన్నారు. మారుతి ఇప్పటి వరకు చేసిన సినిమాలకి బియాండ్ లైన్ లో ది రాజాసాబ్ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News