జపాన్ ఫ్యాన్స్ చెంతకు ప్రభాస్.. కారణమిదే!
తాజా సమాచారం ప్రకారం... ప్రభాస్ .. కల్కి బృందం త్వరలో కల్కి సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి ముందు ప్రమోషన్స్ కోసం జపాన్‌కు వెళ్లనున్నారు.
జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అంత పెద్ద స్టార్‌డమ్ అందుకున్నాడు ప్రభాస్. బాక్సాఫీస్ కలెక్షన్లలో అంతకుమించి అని నిరూపిస్తున్నాడు. పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కి జపనీ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. భారతదేశంలో అడుగుపెడితే ప్రభాస్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చే జపనీ ఫ్యాన్స్ ఉన్నారని గతంలో ప్రూవ్ అయింది. బాహుబలి ఫ్రాంచైజీ, సలార్ భారీ విజయం ప్రభాస్‌ను జపాన్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ సినీ నటుడిగా నిలబెట్టాయి. అతడు తన జపాన్ అభిమానులను మరోసారి పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్, సైన్స్ ఫిక్షన్ డ్రామా 'కల్కి 2898 AD' జపాన్‌లో 3 జనవరి 2025న జపాన్‌లో నూతన సంవత్సర పండుగ అయిన షోగట్సు డే కి విడుదలవుతుందని తెలుస్తోంది. కల్కి జపనీ వెర్షన్‌ను ప్రముఖ జపనీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ అయిన ట్విన్ రెడీ చేస్తోంది. ఈ సంస్థ అక్కడ భారీగా పంపిణీ చేస్తుంది.
తాజా సమాచారం ప్రకారం... ప్రభాస్ .. కల్కి బృందం త్వరలో కల్కి సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి ముందు ప్రమోషన్స్ కోసం జపాన్‌కు వెళ్లనున్నారు. ప్రభాస్ సహా దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ టూర్ కి వెళ్లే ఛాన్సుంది. ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ పాత్రను పోషించారు. కల్కి 2898 AD గతంలో విడుదలై ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 1,100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు జపాన్ వసూళ్లు 30 కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు.