ప్రభాస్ 2025లో మూడు సినిమాలతో వస్తాడా?

2023లో ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ 2024లో మాత్రం 'కల్కి 2898 ఏడీ' సినిమాతో మాత్రమే వచ్చాడు.

Update: 2025-01-04 07:30 GMT

2023లో ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ 2024లో మాత్రం 'కల్కి 2898 ఏడీ' సినిమాతో మాత్రమే వచ్చాడు. ప్రతి ఏడాది రెండు సినిమాలను విడుదల చేయాలని ప్రభాస్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఏవో కారణాల వల్ల సాధ్యం కావడం లేదు. ఆయన నుంచి ఈ ఏడాదిలో ఎన్ని సినిమాలు వస్తాయి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్‌' సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందట. టాకీ పార్ట్‌ దాదాపు పూర్తి అయ్యింది, నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలుస్తోంది. ఏప్రిల్‌లో సినిమా అనుకున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

రాజాసాబ్‌ సినిమాను ఏప్రిల్‌ నుంచి తప్పించినా కచ్చితంగా సమ్మర్‌లోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్‌, మారుతి కాంబో సినిమా రాజాసాబ్‌ 2025 సమ్మర్‌కి దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఇదే ఏడాదిలో ప్రభాస్‌ నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి ఆయన గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చిన 'కన్నప్ప'. మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించడంతో అంచనాలు పెరిగాయి. ఎంత సమయం ప్రభాస్ ఆ సినిమాలో నటిస్తాడు అనేది క్లారిటీ లేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కన్నప్ప సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నప్ప సైతం ఈ ఏడాది సమ్మర్‌లోనే విడుదల కాబోతుంది.

రాజాసాబ్‌తో సమాంతరంగా సీతారామం సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. ఆర్మీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసిన హను రాఘవపూడి సినిమాను సమ్మర్ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. యుద్దం - ప్రేమ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా ఉంటుందట. భారీ యుద్ద సన్నివేశాలు ఉన్నా సినిమాను చాలా స్పీడ్‌గా పూర్తి చేయాలని దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్‌ చేస్తున్నారు.

అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే 2025లోనే ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ఫౌజీ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే 2025లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు విడుదల అయినట్లు అవుతుంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి అరుదైన ఘటన జరగలేదు. కెరీర్‌ ఆరంభం నుంచి ప్రభాస్ నటించిన సినిమాలు ఒకే ఏడాది మూడు విడుదలైన సందర్భాలు లేవు. కనుక 2025 సంవత్సరం ఆయనకు స్పెషల్‌గా నిలుస్తుంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమూడు సినిమాలు కాకుండా సలార్‌ 2, స్పిరిట్‌ సినిమాలను సైతం ఈ ఏడాదిలోనే ఆయన చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అవి 2026లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తోంది.

Tags:    

Similar News