స్పిరిట్ తో నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ నెస్..!
అందరు దర్శకులు ఒకలా ఉంటే తను డిఫరెంట్ అంటూ కేవలం మూడంటే మూడో సినిమాలతో తన సత్తా చాటాడు.;
బాహుబలి ప్రభాస్ లాంటి హీరోని యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. స్పిరిట్ తో అది నెరవేరబోతుంది. మామూలుగానే ప్రభాస్ మాస్ కటౌట్ కి జస్ట్ అలా చూస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అలాంటి ప్రభాస్ తో స్పిరిట్ అంటూ ఒక పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అందరు దర్శకులు ఒకలా ఉంటే తను డిఫరెంట్ అంటూ కేవలం మూడంటే మూడో సినిమాలతో తన సత్తా చాటాడు.
ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ లో తోపు అనిపించేశాడు ఈ డైరెక్టర్. అర్జున్ రెడ్డి ఒకలా.. యానిమల్ ని మరోలా రెండు సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ మాస్ యాటిట్యూడ్ తో వారెవా అనిపించేశాడు. ప్రభాస్ తో సందీప్ వంగ ఒక పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటివరకు చూసిన పోలీస్ సినిమాలు ఒకలా ఉంటే స్పిరిట్ సినిమా దానికి మించి ఉంటుందట.
ఇక సందీప్ సినిమాలో బ్లడ్ బాత్ గురించి తెలిసిందే. సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఇండియన్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటాయని తెలుస్తుంది. సందీప్ వంగ మ్యాడ్ నెస్ ఎలా ఉంటుందో మరోసారి చూపించేలా ప్రభాస్ స్పిరిట్ ని రూపొందించబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఈ సినిమాకు కావాల్సిన విధంగా తన మేకోవర్ కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో స్పిరిట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. స్పిరిట్ సినిమా 2027 రిలీజ్ ప్లానింగ్ తో ఉన్నారట. సో ప్రభాస్ సందీప్ సినీ లవర్స్ కి ఒక దుమ్ము దులిపేసే మాస్ బొమ్మని అందించబోతున్నారని తెలుస్తుంది.
సందీప్ వంగ సినిమా స్క్రిప్ట్ వర్క్ నుంచే ఒక టైప్ ఆఫ్ అట్మాస్పియర్ సిద్ధమవుతుంది. స్పిరిట్ కి సంబందించి కూడా అదే తరహా స్క్రిప్ట్ ఇంకా స్క్రీన్ ప్లేని రెడీ చేస్తున్నాడట. ప్రభాస్ కూడా స్క్రిప్ట్ చూసే సినిమా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటుందని భావిస్తున్నాడట. తప్పకుండా సందీప్ వంగ మార్క్ సినిమాగా ప్రభాస్ స్పిరిట్ పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ కు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా కాస్టింగ్ ఎవరు ఇంకా మిగతా డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. ఈ సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం భారీ అంచనాలతో ఉన్నారు.