ప్రభాస్ - పవన్.. ఇద్దరు ఇద్దరే..
ఈ ఇద్దరు స్టార్స్ తమని అభిమానించే ప్రజలపై ప్రభావం చూపేలా ఏ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే ఉద్దేశ్యం లేకపోవడం వలన వేలకోట్ల రూపాయిల ఆదాయాన్ని వదిలేసుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కోట్లాదిమంది అభిమానులు వారిని అనుసరిస్తూ ఉంటారు. వారు చెప్పే ప్రతి విషయాన్ని పాటించే ప్రయత్నం చేస్తారు. అందుకే అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు కోట్లాది రూపాయలు ఆ స్టార్ హీరోలకు రెమ్యూనరేషన్ గా ఆఫర్ చేసి తమ ప్రొడక్ట్స్ ని మార్కెట్ చేసుకోవాలని అనుకుంటారు. స్టార్ ఇమేజ్ వచ్చిన హీరోలు చాలామంది కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు.
హీరోయిన్స్ కూడా తమ బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన కమర్షియల్ యాడ్స్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. బ్లాక్ చెక్ ఆఫర్ చేసిన కూడా నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు మన తెలుగులో ఉన్నారు.
ఇక అందులో పవర్ స్టార్ పవన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ మొత్తం ఆఫర్స్ వచ్చినా కూడా ఈ ఇద్దరు యాడ్స్ చేయడానికి టెంప్ట్ అవ్వలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. 300 కోట్లకి పైగా మార్కెట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ ఉన్నాడు. 150 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ని అతను ఒక్కో సినిమాకి తీసుకుంటున్నాడు.
ఈ స్థాయిలో మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరోలు కమర్షియల్ యాడ్స్ చేయాలని అనుకుంటే ఏడాదికి వెయ్యి కోట్లకి పైగా సంపాదించాగలరు. కానీ ప్రభాస్ కి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి వేలకోట్లు ఉంటుంది. అలాగే సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు. కమర్షియల్ యాడ్స్ చేయాలని ఆఫర్స్ వచ్చిన కూడా ప్రభాస్ వాటిని పట్టించుకోలేదు.
అలాగే టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మరో స్టార్ పవన్ కళ్యాణ్. అతనికి కెరియర్ ఆరంభంలోనే విపరీతమైన యూత్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ డబ్బులని యాడ్స్ కోసం ప్రముఖ కంపెనీలు చెల్లించడానికి ముందుకొచ్చిన తిరస్కరించారు. కెరీర్ మొదట్లో పెప్సీ లాంటి కాంపెనీలకు చేసినప్పటికీ ఆ తరువాత మాత్రం అవి చేయడం కరెక్ట్ కాదని రిజెక్ట్ చేస్తూ వస్తున్నాడు.
ఈ ఇద్దరు స్టార్స్ తమని అభిమానించే ప్రజలపై ప్రభావం చూపేలా ఏ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే ఉద్దేశ్యం లేకపోవడం వలన వేలకోట్ల రూపాయిల ఆదాయాన్ని వదిలేసుకున్నారు. ఎథిక్స్ ని ఫాలో అవుతూ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించడం కరెక్ట్ కాదనుకొని కమర్షియల్ యాడ్స్ కి దూరం ఉన్నారు. అందుకే కోట్లాది మంది ప్రజలు వీరిని అభిమానిస్తూ ఉంటారు. ప్రభాస్ కి అయితే సినిమానే ప్రపంచం. వివాదాలకు సైతం అతను దూరంగా ఉంటాడు.