ప్రభాస్ పుట్టినరోజు డార్లింగ్ బజ్

ప్రభాస్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ దృష్ట్యా, 'డార్లింగ్' 4K రీ-రిలీజ్‌కి కూడా భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది.

Update: 2024-08-21 10:06 GMT

ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవడం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇక అంతకుముందు సలార్ తో మాస్ ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గా హను రాఘవపూడి తో కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా మంచి కిక్ ఇచ్చాయి.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ ఏడాది ఆయన పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారబోతోంది. దానికి కారణం, ప్రభాస్ నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డార్లింగ్' సినిమా 4K లో రీ రిలీజ్ కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ సినిమా తిరిగి థియేటర్లలోకి రాబోతోంది.

2010లో విడుదలైన 'డార్లింగ్' సినిమా ప్రభాస్ కెరీర్‌లో స్పెషల్ చిత్రంగా నిలిచింది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తన రొమాంటిక్ ఎమోషనల్ సన్నివేశాలతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా 'డార్లింగ్' అని అభిమానులు ప్రేమగా పిలిచేలా చేసింది.

ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్రకి, స్క్రీన్‌ప్రెజెన్స్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. కామేడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక GV ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అల్ టైమ్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటి. అయితే ఇప్పుడు ఈ సినిమాని 4K రిజల్యూషన్‌లో రీ-మాస్టర్ చేసి మళ్లీ విడుదల చేయబోతున్నారు. రొమాంటిక్, ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా, ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా నూతనంగా సాంకేతిక నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ దృష్ట్యా, 'డార్లింగ్' 4K రీ-రిలీజ్‌కి కూడా భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అభిమానులు ఈ రీ-రిలీజ్‌ ద్వారా తమ అభిమాన హీరోను మరోసారి వెండితెరపై చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ రీ-రిలీజ్ ప్రభాస్‌ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చనుంది. గతంలో విడుదలైన రీ-మాస్టర్ వర్షన్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో 'డార్లింగ్' కూడా అదే స్థాయిలో ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News