ప్రభాస్ కల్కి ఆ టార్గెట్ రీచ్ అవుతుందా..?
అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా కల్కి 2898 AD మీద్ హోప్స్ పెట్టుకున్నారు.
ఒక తెలుగు సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ పై విజయ దుందుంభి మోగిస్తుందని.. అక్కడ సినిమాలను వెనక్కి నెట్టి 2000 కోట్ల వసూళ్ల మోత మోగిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అది సాధ్యం చేయొచ్చని ప్రూవ్ చేశాడు రాజమౌళి. ఆయన డ్రీం ని తెర మీద హీరోగా ముందుండి నడిపించాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియానే. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యాం, ఆదిపురుష్, సలార్ 1 ఇలా వరుస సినిమాలతో నేషనల్ లెవెల్ లో సత్తా చాటుతున్నాడు ప్రభాస్.
వాటిలో సక్సెస్ అయినవి కొన్నైతే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వని మరికొన్ని ఉన్నాయి. అయితే బాహుబలి రేంజ్ లో ప్రభాస్ మార్క్ వసూళ్లను మాత్రం ఈ సినిమాలేవి రాబట్టలేకపోయాయి. కె.జి.ఎఫ్ మేకర్ ప్రశాంత్ వర్మ తో చేసిన సలార్ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంలో విఫలమైంది. అందుకే సినిమా 600 కోట్ల లోపే వసూళు చేసింది.
అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా కల్కి 2898 AD మీద్ హోప్స్ పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ సినిమా ట్రీట్ మెంట్ తో వస్తుంది. ఈ సినిమా తప్పకుండా రెబల్ స్టార్ స్టామినా చూపిస్తుందని అంటున్నారు. కల్కి కూడా రెండు భాగాలుగా వస్తుంది. ఈ రెండు సినిమాలతో మరోసారి 2000 కోట్ల మార్క్ టచ్ చేయాలని అనుకుంటున్నారు.
సినిమాలో ఆ రేంజ్ విషయం ఉంటే ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ కి అది పెద్ద విషయం కాదు. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ తన సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. యానిమల్ తో రణ్ బీర్ కపూర్ కూడా 900 కోట్ల దాకా వచ్చాడు. కల్కి తో ప్రభాస్ కూడా ఆ రేంజ్ రీచ్ అవ్వగలిగితే మాత్రం మరోసారి బాహుబలి రికార్డులు పునరావృతమవుతాయని చెప్పొచ్చు. తన సినిమా రికార్డులను తానే బద్ధలు కొట్టేందుకు కల్కి అవతారంలో ప్రభాస్ వస్తున్నాడు. మరి అనుకున్న విధంగా కల్కి ఉంటుందా లేదా అన్నది చూడాలి. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.